గురుస్వామి రామకృష్ణ మనవరాలు గాయత్రి ఐశ్వర్య జన్మదిన సందర్భంగా నిర్వహణ
స్థానిక కాకినాడ రోడ్ లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట వాస్తవ్యులు ప్రముఖ పురోహితులు, గురు స్వామి మామిళ్ళపల్లి రామకృష్ణ, రాధాదేవి దంపతుల మనవరాలు గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి తండ్రులు,అర్చక,పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప,మౌనికల ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీనుమణిబాబు ముఖ్యఅతిథిగా హాజరై గాయత్రి ఐశ్వర్య తల్లిదండ్రులు అయ్యప్ప,మౌనికతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ ఈరోజు గురుస్వామి అయ్యప్ప వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వఅన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు,ప్రధాన కార్యదర్శి సోమసుందరం,కార్యదర్శి రవి,జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రకి రాంబాబు, లారీ యూనియన్ అధ్యక్షులు మారిశెట్టి రాధా, యల్లమిల్లి సీఎం, దాపర్తి సీతారామయ్య, దుర్గపు ప్రకాష్, డేగల సత్తిబాబు, బద్ది సురేష్, అన్నకాంటీన్ ఇంచార్జి ఎండి కాజా, నేదూరి గణేష్, సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్, మారిశెట్టి గంగ, నాగిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు.