మనమిత్ర వాట్సాప్ ద్వారా అన్నదాత సుఖీభవ రైతులు జాబితాను పొందే అవకాశం
తుది జాబితాలో పేరులేని అర్హులైన రైతులు రైతు సేవ కేంద్రంలో గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చు
వ్యవసాయ అధికారి రమేష్ కుమార్
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం రాయవరం, వి.సావారం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ తెలిపారు, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల జాబితా రైతు సేవ కేంద్రంలో అందుబాటులో ఉందని, “మన మిత్ర వాట్సప్ ” ద్వారా కూడా లబ్ధిదారుల సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉందని సూచించారు, తుది జాబితాలో పేర్లు లేని అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రంలో ఆధార్, భూమి వివరాలతో తగిన ధ్రువపత్రాలు సమర్పించి గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చవన్నారు, గ్రీవెన్స్ నమోదు చేయడానికి చివరి తేది 13 జూలై 2025. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు మరియు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

