అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎన్టీఆర్ భరోసా పథకంలో పెన్షన్లు అందజేస్తామని కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి అన్నారు. మండల కేంద్రం చాగల్లులో ఎన్టీఆర్ భరోసా పథకంలో నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను లబ్ధిదారులకు అందేశారు. గత ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు పంపిణీ చేసి వ్యవస్థను నాశనం చేశారన్నారు. అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని చంద్రబాబు నాయుడు పరిగెత్తిస్తుంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ సొమ్మును ఇంకా భద్ర పరుచుకుంటున్నారని మండిపడ్డారు. చాగల్లు మండలం 9109 పింఛన్లకు రూ.3.96 కోట్లు వెచ్చించగా నూతనంగా మంజూరైన 137 స్పౌజ్ పింఛన్లకు రూ.5.48 లక్షలు అదనంగా పెరిగాయన్నారు. మొత్తం 9246 పింఛన్లకుగాను రూ.4.23 కోట్లు పంపిణీ చేయటం జరిగిందని ఎంపీడీవో శ్రీదేవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు జొన్నకూటి సుబ్బారావు, తహసీల్దార్ ఎం.మెరికమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ రాజేష్, జె.ఆనంద్, బొల్లిపో బన్ను తదితరులు పాల్గొన్నారు.