నిందితులను కఠినంగా శిక్షించాలి
మరోతి శివ గణేష్
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం, గోకవరం గ్రామం,బంగాళా పేటకు చెందిన దళిత మైనర్ బాలిక పావని పై ఈనెల 8వ తారీఖున ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దుర్ఘటనకు సంబంధించి బాధితురాలని వారి స్వగృహం నందు జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ పరామర్శించి, బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మరోతి శివ గణేష్ మీడియాతో మాట్లాడుతూ పోక్సో చట్టం ప్రకారం స్థానిక తాసిల్దార్ బాధితురాలని సందర్శించవలసిన అవసరం ఉందని, బాధితురాలికి చాటరీత్యా ఆర్థిక సహకారంనకు సంబంధించిన తగు న్యాయ చర్యలు తీసుకోవాలని,కానీ బాధితురాలను సందర్శించక పోవడం చట్ట విరుద్ధమని అన్నారు.డిస్ట్రిక్ట్ కలెక్టర్ తగు చర్యలు తీసుకొని బాధితురాలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నుండి తక్షణ సహాయం కింద పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యాలని శివ గణేష్ డిమాండ్ చేశారు.పేద బడుగు బలహీన వర్గాల రక్షణ పట్ల స్థానిక శాసనసభ్యునికి చిత్త శుద్ధి లేదని,ఈ రోజు వరకు కూడా బాధితురాలును జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు పరామర్శించలేదని శివ గణేష్ దుయ్య భట్టారు.65(1),4(2) పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ ల కింద FIR NO:206/2025 dated 8-9-2025 , గోకవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు శివ గణేష్ మీడియా కు తెలియ జేశారు. మరో రెండు పని దినాల్లో బాధితులకు ఆర్థికపరమైన న్యాయం జరగకపోతే బాధితులతో కలిసి నిరసనకు దిగుతామని ప్రభుత్వాన్ని శివ గణేష్ హెచ్చరించారు. అదేవిధంగా బాధితురాలకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శివ గణేష్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ నక్క సత్యనారాయణ,గోకవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల రత్నాజ రావు, ఏపీసీసీ ఎస్సీ సెల్ నాయకులు కొండా శ్రీను,బ్లాక్ 2 అధ్యక్షులు బెల్లం బాపిరాజు,మాసారపు అప్పా రావు తదితరులు పాల్గొన్నారు.