14 October 2025
Tuesday, October 14, 2025

అయినవిల్లి వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమలాపురం

విఘ్నాలు తొలగించి విజ యాలను ప్రసాదించే వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోనసీమ జిల్లా వాసుల పై ఉండాలంటూ కోనసీమ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభా కాంక్షలు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు బుధవారం జిల్లా కలెక్టర్ దంపతులు వినాయక చవితి పర్వదినాన్ని పుర స్కరించుకుని అయిన విల్లిలో ప్రముఖ ఖ్యాతి పొందిన విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు వినాయక చవితి సందర్భంగా కోనసీమ జిల్లా ప్రజలం దరూ సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో ఉండాలని విజ్ఞానానికి, విజయానికి ప్రతీక అయిన వినాయకుడు మన అంద రికీ మంచి బుద్ధిని, శాంతిని, అభివృద్ధిని ప్రసా దించాలని ఆయన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని మన స్పూర్తిగా కోరారు.”ఓం వక్ర తుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా” అంటూ వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ అత్యంత వైభవోపేతంగా వినాయక చవితి పూజాధి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ వారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గణేష్ దసరా ఉత్సవ మండ పాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నిర్దేశిత పార్మెట్ 1, 2 లలో వాస్తవ ఖర్చును పొందడం, అవ సరమైన సూచనలు జారీ చేశారన్నారు.అధీకృత గణేష్ ఉత్సవ మండపాలు దుర్గా దేవి ఉత్సవ మండ పాలు ఉచిత విద్యుత్ సరఫరా పొడిగింపుకు సంబంధించి ఈనెల 27వ తేదీ నుండి సెప్టెంబరు 6వ తేదీ వరకు 11 రోజులు పాటు, గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాలకు, మరియు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు తొమ్మిది రోజులు పాటు దసరా (దుర్గాదేవి) నవరాత్రి ఉత్సవ మండ పాల వేడుకలకు సంబం ధించిన ఉచిత విద్యుత్ వినియోగంపై సూచనలు జారీ చేశారన్నారు గణేష్ ఉత్సవ మండపాలు మరి యు దుర్గాదేవి ఉత్సవ మండ పాలు విద్యుత్ వెలుగులకు తాత్కాలిక సరఫరా ఇవ్వబ డుతుం దని ఈ ఉత్సవ మండ పాలకు అయిన విద్యుత్ వినియోగ యూనిట్లు వ్యయాన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కె.వి లోడ్ మరియు పట్టణ ప్రాంతాల్లో 5 కె.వి లోడ్ పైన ఉన్న ఉత్సవ మండపాలను అనుమతించడం జరుగు తుందన్నారు. అంతకంటే ఎక్కువ లోడ్లు ఉంటే సాధా రణ తాత్కాలిక సరఫరా విధానాన్ని అనుసరించాలన్నారు అంతే కాకుండా, విద్యుత్ ప్రమాదాలు మరియు ఇతర అవాంఛ నీయ సంఘటనలను నివారించడానికి ముందస్తు భద్రతా చర్యలు తీసు కోవా లని అందరూ క్షేత్ర స్థాయి అధికా రులను ప్రభుత్వం ఆదే శించిందన్నారు మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణప తి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకున్నారు వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సా హాలతో గణేష్ ను పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని మరొక్కసారి వినాయకుని ప్రార్థి స్తున్నానన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo