బంధనపూడి గ్రామ సర్పంచ్ డేగల తిరుమలవేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం
మంగళవారం బందనపూడి గ్రామంలో వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మూడువందలకుపైగా చెట్లు నాటే కార్యక్రమం విజయవంతంగా సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూగ్రామస్తులకి మొక్కలను పంచాయితీ లో సర్పంచ్ తన సొంత ఖర్చులతో ఉచితంగా అందచేసే ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారు.ఒక చెట్టు నాటడం అనేది ఒక ప్రాణానికి ఊపిరి నాటినట్లే. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలంటే ప్రతీ ఒక్కరూ మొక్క నాటి దానికి రక్షణ కల్పించాలి అని పిలుపునిచ్చారు .గ్రామ స్థాయిలో ఈ విధమైన పర్యావరణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరిగేలా చేయడం మరియు గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి తిరుమలవేణి , గ్రామ కార్యదర్శి,పంచాయతీ సిబ్బంది, వీఆర్వో,గ్రామ ప్రజలు సమూహంగా పాల్గొని తమ పర్యావరణ అభిమానం చాటుకున్నారు.