అమరుల త్యాగం నిండు శోకం…
మండపేట జామియా మజిద్ లో ప్రార్థనలు…
బలిదానానికి మొహరం ప్రతీక గా నిలుస్తుందని మండపేట అహలే సున్నత్ వల్ జమాత్ జామియా మజీద్ ఇమామ్ గులాం మొహమ్మద్ ముర్షిద్ రజ్వీ అన్నారు. మొహరం 10 వ రోజు ప్రార్థనలు ఆదివారం జామియా మస్జిద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిండు శోకం తో కార్బల మైదానం లో అమరులైన వీరులకు నివాళులు అర్పించారు. వారి అమర గాథలు వినిపించారు.ఇమామ్ మాట్లాడుతూ ఆనాటి ఇరాక్ లోని కర్బలా మైదానం లో మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ రజి అల్లహు వారు పోరాట పటిమ చూపి వీర మరణం పొందారని పేర్కొన్నారు. రాజ్యాలు, రాజరికలకు, అధికారం కోసం కాకుండా ఇస్లాం మతోద్దరణ కు అసువులు బాసరని చెప్పారు. ఏక దైవ ఆరాధన కోసం పరితపించి నమ్మిన సిద్ధాంతం కోసం ఇస్లాం మతం కోసం ప్రాణాలు థారాపోసారని చెప్పారు. ఇస్లాం మత ఆచారాల్లో నమాజ్ చాలా ముఖ్యమని ప్రతి ముస్లిం ప్రతి రోజు విధిగా ఐదు పూటలు వేళకు నమాజ్ ఆచరించాలని కోరారు. న్యాయం గా వర్తించాలని ధర్మం గా నడుచుకోవాలని ఇస్లాం ఆదేశిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మొహరం అషూర ప్రార్థన లు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.పెద్ద సంఖ్యలో ముస్లిం లు హజరయ్యారు.