బాబు మోసాలు ప్రజలోకి తీసుకెళ్తున్నాం
బాబు మోసాలు ప్రజలోకి తీసుకెళ్తున్నాం
పిల్లి సూర్యప్రకాష్
రామచంద్రాపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురంలో 19,20 వ వార్డ్ లలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జి మరియు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికలముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోయారని,అందుకే ప్రజలు తెలుసుకునేలా
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, మోసపూరిత హామీలను నియోజకవర్గంలో గ్రామాలలో ప్రజలకు వివరించడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఉందని,వచ్చేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని,మళ్ళీ జగనన్న పాలన చూడబోతారని సూర్యప్రకాష్ అన్నారు.ఈ లోపు పంచాయతీ ఎలక్షన్ లు అతి దగ్గరగా వున్నాయి అని,అందలో మన సత్తా ఏంటో చూపించాలని వైసీపీ శ్రేణులుకు పిలునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, కౌన్సిలర్స్,మరియు అధికార ప్రతినిధులు,అనుబంధ విభాగ అధ్యక్షులు,వార్డు సీనియర్ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.