డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని గోపవరం, కిత్తనచెరువు గ్రామాలలో కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు….
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఎన్నికలలో చంద్రబాబు మోస పూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను తమ పార్టీ గ్రామ కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు..ఈ సందర్భంగా క్యూఆర్ కోడ్ తో ఉన్న బ్రోచర్ను ప్రజలకు అందించారు…
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, బద్రి బాబ్జి, గెడ్డం సంపదరావు,కార్యదర్శి దంగేటి రాంబాబు, నిమ్మకాయల హనుమంతు,పొగాకు శ్రీను,తదితరు నేతలు,సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు…