ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ గ్రూపులు, మెసేజ్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా “ఈ సినిమా ఫ్రీగా చూడండి” లేదా “ఇక్కడ డౌన్లోడ్ చేయండి” అనే శీర్షికలతో అనేక లింకులు పంపబడుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడవచ్చు.
ఈ లింకులు ద్వారా కలిగే ముప్పులు:
-
అవి మాలిషియస్ (హానికరమైన) లింకులు అయి ఉండే అవకాశం ఉంది
-
మొబైల్ లేదా కంప్యూటర్‌లోని వ్యక్తిగత డేటా, బ్యాంక్ సమాచారం, ఫోటోలు వంటి ముఖ్యమైన వివరాలు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది
-
అపరిచిత లేదా అనధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు ద్వారా హానికరమైన మాల్వేర్ మొబైల్‌లోకి చొరబడవచ్చు
భద్రత కోసం పాటించాల్సిన సూచనలు:
-
అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన లింకులపై క్లిక్ చేయకండి
-
అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లేదా ధృవీకృత సినిమా స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారానే సినిమాలు వీక్షించండి
-
సైబర్ మోసాల గురించి చైతన్యంతో ఉండండి
-
అనుమానం ఉన్న వెబ్‌సైట్లు, యాప్‌లను ఉపయోగించకుండా, సంబంధిత అధికారులకు తెలియజేయండి
పౌరులుగా మన బాధ్యత – మోసపూరిత కార్యకలాపాల నుండి జాగ్రత్తగా ఉండడం.
ఇది మీ డిజిటల్ భద్రతకు సంబంధించిన ఒక కీలక సూచన.