భీమేశ్వర సన్నిధిలో కాకినాడ 3వ జడ్జి ఆనంది
కాకినాడ 3వ జడ్జి జి. ఆనంది కుటుంబ సమేతంగా ద్రాక్షారామ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం కోసం ఆలయానికి విచ్చేసారు.దర్శనం నిమిత్తం వచ్చిన జడ్జి ఆనంది కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాములు అందించన ఆలయ సిబ్బంది.అలానే ఆలయ విశిష్టత మరియు దేవాలయం యొక్క పరిసరాల ప్రాంతలను వివరించారు.నిత్యం అన్న సమారాధన జరుగుతుందని,భక్తులు రోజుకు అనేక మంది భీమేశ్వర స్వామి దర్శనం కోసం వస్తువుంటారని ఆమెకు తెలియజేసారు.