14 October 2025
Tuesday, October 14, 2025

భూమి మీద పుట్టిన ప్రతివ్యక్తి స్వేచ్ఛగా బతకాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

  • ఆ దిశగా మానవహక్కుల రక్షణకు కృషి
  • మానవహక్కులకు భంగం కలిగినా అక్కడ మేం ఉంటాం
  • హ్యూమన్ రైట్స్ పేరుతో ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదు
  • అవగాహన సదస్సులు పెట్టి,ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నాం
  • బాధితులకు అండగా నిలుస్తున్న డాక్టర్ ఖండవల్లి లక్ష్మిని జాతీయ అవార్డుతో సత్కారించాం
  • హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బతకాలన్నదే తమ ఉద్దేశ్యమని అందుకోసమే తమ సంస్థ గడిచిన 9 ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ చెప్పారు.అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సంస్థ తరుపున స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడుతూ నెలకొక జిల్లాలో మానవహక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఉచితంగా న్యాయ సహాయం చేస్తున్నామని తెలిపారు.ఎవరైతే హక్కులు కోల్పోయారో వారు తమను సంప్రదిస్తూ, వారికి అండగా ఉండి, సహకరిస్తామని ప్రసన్న కుమార్ అన్నారు. ఎక్కడ మానవహక్కులకు భంగం కలిగినా అక్కడ తాము ఉంటామన్నారు.అందులో భాగంగానే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళా విభాగం చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు.ఇంకా జిల్లా స్థాయిలో విస్తృతంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.


ఈ మధ్య హ్యూమన్ రైట్స్ సంస్థల గురించి రాష్ట్రంలో ఎంక్వైరీ చేసారని ప్రసన్న కుమార్ చెబుతూ ఎందుకంటే మానవ హక్కుల పేరుతో పుట్టగొడుగుల్లా కొన్ని సంస్థలు పుట్టుకు రావడం చూస్తున్నామని అన్నారు. అయితే ఎంక్వైరీలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత 9ఏళ్లుగా చేస్తున్న రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తో కల్సి పనిచేస్తున్నామన్నారు. కొంతమంది తమ సంస్థలో గతంలో పనిచేసిన వారిలో తేడా రావడంతో వారిని తొలగించామని ఆయన చెప్పారు. అలాంటివాళ్ళు తమ సంస్థ పేరు చెప్పి పనిచేస్తున్నట్టు తెలిసిందని, అయితే ఆలాంటి వారు తమ సంస్థ సభ్యులు కాదని ప్రసన్న కుమార్ స్పష్టం చేసారు. ఒకవేళ మానవహక్కుల సంఘం పేరుతో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా, ప్రలోభాలకు గురి చేసినా తమకు ఫిర్యాదు చేయవచ్చని హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తెలిపిందని ఆయన చెప్పారు. మానవహక్కుల సంఘం పేరుతో బ్లాక్ మెయిల్ చేసినా, ప్రలోభాలకు గురి చేసినా తమకు తెలియచేస్తే తమ మానవహక్కుల పరిరక్షణ పత్రికలో వారి ప్రచురించి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కమిషన్ నియామకం లేనందున స్పందన రావడంలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రజలకు సేవలు అందిస్తూ, సహాయ సహకారాలు అందించినవారిని గుర్తించి ఏటా నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నామని ప్రసన్న కుమార్ తెలిపారు. అందులో భాగంగా మానవహక్కులు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నారని,ఎక్కడ మహిళలకు,యువతులకు అన్యాయం జరిగినా ఆమె అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేందుకు ధైర్యంగా పోరాడి కృషి చేస్తున్న ఖండవల్లి లక్ష్మిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అందచేసి సత్కరించామని ఆయన చెప్పారు. ఆమె చేసిన సేవలకు అభినందనలు తెలిపారు. అలాగే విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన ఐసిడిఎస్ అధికారిణి టి.కనకవల్లికి, తొర్లపాటి శీతల్ కు కూడా జాతీయ అవార్డులు అందించినట్లు ఆయన చెప్పారు.

ఎక్కడా ఎలాంటి తప్పు చేయడం లేదు
మహిళలకు అన్యాయం జరిగితే నిర్భయంగా పోరాడుతున్నా
-జాతీయ అవార్డు ఇచ్చినందందుకు కృతజ్ఞతలు
-హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళా విభాగం చైర్ పర్సన్ ఖండవిల్లి లక్ష్మి

ఖండవల్లి లక్షి మాట్లాడుతూ సేవా దృక్పథంతో తాను చేస్తున్న కార్యక్రమాలు చూసి తనను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళా విభాగం చైర్ పర్సన్ గా నియమించిన జాతీయ అధ్యక్షుడు తాళ్ళూరి ప్రసన్న కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనను నియమించినపుడు ఎక్కడ ఎలాంటి తప్పు జరగకూడదని స్పష్టంగా చెప్పడంతో ఎలాంటి తేడాలు లేకుండా పనిచేస్తున్నానని తెలిపారు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్ళి వారికి న్యాయం జరిగేలా చేస్తున్నామన్నారు. సంస్థ విషయంలో చాలా నిజాయితీగా ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేస్తున్నానని ఆమె స్పష్టం చేసారు. భయపడి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళమని ప్రసన్న కుమార్ చెబుతూ ఉంటారని, ఆవిధంగా చేయడం వలన ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిందని ఆమె వివరిస్తూ,టీమ్ సభ్యులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీజనల్ చైర్మన్ పులి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ చైర్మన్ వై.వి.జగన్నాధరావు, సంస్థ డైరెక్టర్ డాక్టర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కాగా వీరందరితో పాటు రాష్ట్ర స్థాయి సదస్సుకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ నాగిడి శ్రీ లక్ష్మీ, జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ జె ప్రసాద్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పేరిచర్ల సూర్య ప్రభావతి, స్టెక్ ఇమ్యూనివాషన్ ఆఫీసర్ డాక్టర్ కోమలి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మేరీ వసంతి, రాజానగరం తహసీల్దార్ జి అనంతలక్ష్మి దేవి, రాజానగరం ఉమెన్ చైల్డ్ ఫర్ డిపార్ట్మెంట్ టీ కనకవల్లి,అడ్వకేట్, విజిలెన్స్ కమిటీ సభ్యులు ధర్నాలకోట వెంకటేశ్వరరావు,తోర్లపాటి సీతల్, సంస్థ ప్రతినిధులు కండవెల్లి బేబీ, కిల్లాడి బేబీ, రత్నకుమారి, జె రాణి తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo