భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
రామసేన సంస్థ స్థానిక సంస్థల ఎన్నికలో పోటికి సిద్ధమని ఓ దినపత్తిలో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు
భారతీయ జనతా పార్టీ నాయకులుగా అధిష్టానం నిర్ణయానికి లోబడి తాము ఎప్పుడు పని చేస్తామని, పార్టీ ఆదేశాలను ఎప్పుడు ధిక్కరించలేదని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రామసేన సంస్థ నుంచి స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన ఖండించారు. దీనిపై స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తన వద్ద అందరికి కావలసిన ముఖ్యమైన వ్యక్తి స్థానిక ఎన్నికల్లో గోకవరం సర్పంచ్ గా పోటీ చేస్తే బాగుంటాదని, అభిప్రాయం తెలపడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా అందరికీ సుపరిచితుడైన గోకవరం బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర అయితే బాగుంటుందని, మా కార్యకర్తల వద్ద మాత్రమే అంతర్గత అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. తాము ఎక్కడ కూడా బహిర్గతంగా గాని, పత్రికా ముఖంగా గాని వెల్లడించలేదని వివరించారు. ఏ ఎన్నికల గురించి కూడా తాము ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం జరగదన్నారు. అధిష్టానం, పార్టీని దాటి, తాము సొంత నిర్ణయాలను తీసుకోవడం ఎప్పుడు జరగలేదన్నారు. తాము క్రమశిక్షణతో ఉంటామన్నారు. తాను రామసేన సంస్థ నుంచి మూడు నియోజకవర్గల్లో ప్రజలకు సేవలు అందిస్తున్ననే తప్ప, ఎంపీ, ఎమ్మెల్యే అవ్వాలనో దృష్టిలో పెట్టుకుని చేయడం లేదన్నారు. ఇటీవలే సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ లో బంగారు వరలక్ష్మి కానుక-3 కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. కానీ ఓ దినపత్రికలో రామసేన సంస్థ స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమని వార్త ప్రచురించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ నుంచి స్థానిక ఎన్నికలపై ఎక్కడ కూడా పత్రిక ప్రకటన ఇవ్వలేదని, భారతీయ జనతా పార్టీ గురించి ఎక్కడ మాట్లాడలేదన్నారు. అధిష్టానాన్ని కాదనకుండా తాము ఏ నిర్ణయం తీసుకోమని మరోక సారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, బత్తుల నానాజీ, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, పసల గణేష్, దేశాల నరేష్, మందపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు…