అమలాపురం రీజియన్ ఎస్బిఐ ఎంప్లాయీస్ రీజనల్ స్పోర్ట్స్ మీట్ స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ లో ఆదివారం నాడు నిర్వహించారు. రీజియన్ నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉత్సాహం గా పాల్గొన్నారు. షటిల్ బ్యాడ్మింటన్, చెస్ , కార్రమ్స్ మరియు టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్విహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ , ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ వై గణేష్ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వేంకటేశ్వర రావు , ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ సెక్రెటరీ సురేష్ హెచ్ఆర్ మేనేజర్ రవికాంత్ మరియు అధిక సంఖ్యలో ఉద్యోగులు, మహిళా ఉద్యగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.