-పెద్ద కొడుకు చేసే రాద్ధాంతం అంతాఇంతా కాదయ్యా
-వారికి ఆస్తులే కావాలి తప్ప మా బాగోగులు అక్కర్లేదు
-న్యాయం చేయాలనీ వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన
-స్పందనలో పిర్యాదు చేయడానికి సమాయత్తం
తల్లిదండ్రులు వద్దు వారి సంపాదించిన ఆస్తి పాస్తులే మాకు ముద్దు అంటూ.. కన్నతల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం స్థానిక సీతంపేటలో చోటుచేసుకుంది.ఈ సందర్భంగా జుత్తుగ అప్పన్న, జుత్తుగ సత్యవతి మీడియాను ఆశ్రయించి, మాట్లాడుతూ మాకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారని, వారందరికీ వివాహాలు, ఇత్యాది శుభకార్యాలు కూడా పూర్తిచేశామని తెలిపారు.
నేను 2006వ సంవత్సరం లో సీతంపేటలో 72 గజాల స్థలాన్ని సుమారు రూ.5లక్షలకు కొనుగోలు చేసి, 2010 సమయంలో జి+టు భవంతిని నిర్మించామని వారు తెలిపారు పెద్దకొడుకు జుత్తుగ శ్రీను పైన రెండవ అంతస్తులో నివాసం ఉండగా మొదటి అంతస్తులో తాము నివాసం ఉంటున్నామని గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్దకొడుకు వ్యాపారం నిమిత్తం వాడుకుంటున్నాడని, చిన్న కొడుకు భార్య పిల్లలతో వేరేచోట అద్దెకు ఉంటున్నాడని వివరించారు. స్థలంలో ఇంటి నిర్మాణం చేసే సమయంలో నా తల్లిదండ్రుల వద్ద నుండిగానీ, నా కుమారులు కుమార్తెల వద్ద నుండి ఏ ఒక్క రూపాయి ఆర్థిక సహాయం పొందలేదని, నా కష్టార్జితంతో స్థలం కొని ఇంటి నిర్మాణం చేపట్టానని అప్పన్న చెప్పారు. ఇప్పుడు మాకు సుమారు 70 సంవత్సరాలు పైబడి ఉండడం కారణంగా కుటుంబాన్ని పోషించుకునే సత్తువలేక ఇద్దరు కొడుకులపై ఆధారపడి జీవించే పరిస్థితి వచ్చిందని, మరోపక్క ఆరోగ్యంకూడా రోజురోజుకు క్షీణిస్తుందని, ఒకపక్క మందుల ఖర్చు కూడా వేలాది రూపాయలు ఖర్చు కావడంతో పెద్దల సమక్షంలో ఇద్దరి కొడుకుల నుండి నెలకు 6వేలు చొప్పున మాకు ఇవ్వాలని, మా తదనంతరం ఇంటిని వారికే రాస్తామని చెప్పినప్పటికీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని పోలీసులు,కోర్టు,సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా, వారు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చిననప్పటికీ పెద్దకుమారుడు తీరు మార్చుకోలేదన్నారు. తనపై ఘర్షణకు దిగుతూ దాడికి పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయని, లేనిపోని కేసులు పెడుతూ, మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అప్పన్న ఆవేదన చెందారు. ఒకపక్క ఆకలి కేకలు, మరోపక్క వారి వారి పెళ్లిళ్లకు, ఇతరత్రా ఖర్చులకు చేసిన అప్పులు ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోయాయని మరో దారి లేక నేను నిర్మించిన ఇంటిని అమ్మి వేయగలచానని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం పై నా పెద్ద కుమారుడు జుత్తుగా శ్రీను అడ్డుపడుతున్నాడ ని , సదరు విషయాన్ని కోర్టు దృష్టికి అలాగే సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా, వారు నా డాక్యుమెంట్లను అన్నింటిని పరిశీలించి ఇంటిపై పూర్తి అధికారాలు మీకే ఉన్నాయని ఇంటిని అమ్ముకోవచ్చని సూచించారని అప్పన్న వివరించారు. అయితే చేసేదేమీ లేక నాపై పోలీసు కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, న్యాయం నా వైపు ఉండటంవల్ల పోలీసులు కూడా ఈ విషయాన్ని మీరు మీ తల్లిదండ్రుల సమక్షంలో తేల్చుకోండని చెప్పినప్పటికీ మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
మాకు నా పెద్దకొడుకు కోడలు వద్ద నుండి ప్రాణహాని ఉందని, దయచేసి పోలీస్, అధికారులు, పెద్దలు నా ఇంటిని ఆక్రమించిన నా పెద్ద కొడుకును కాళీ చేయించి నా ఇంటిని నాకు అప్పగించి తగు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై సోమవారం స్పందనలో ఎస్పీ, కలెక్టర్ ల దృష్టికి తీసుకువెళ్తానన్నా రు. ఆయన వెంట చిన్న కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.