బాబూ జగజ్జీవన్ 39 వ వర్థంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ నాయకులతో కలిసి మెయిన్ రోడ్డు లోని మహనీయుల సెంటర్లో ఉన్న జగజ్జీవన్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. కోన మాట్లాడుతూ ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన దేశానికి విశేషమైన సేవలు చేశారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధునిగా దేశం కోసం పోరాడిన మహోన్నతుడు అని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి ఆయన కృషిని వివరించారు. సమాజంలో సామాన్యులకు హక్కులు కల్పించడంలో అతని పాత్ర ఎనలేనిదన్నారు. గ్రామీణ కార్మికుల కోసం ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు, జిల్లా కార్యదర్శి గొడవర్తి రామచంద్రరావు, పట్టణ పూర్వపు అధ్యక్షులు ముద్దుల సుబ్బారావు, పట్టణ ఉపాధ్యక్షులు సందక వీరవెంకట సత్యనారాయణ, శకుంతల, మర్రి రామచంద్రరావు, కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి…

మండపేట
రచయిత నుండి మరిన్ని
సంబంధిత వార్తలు
