వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్…
ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామంలో 11 ఏళ్ల చిన్నారి పై జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (బాబీ) లైంగిక దాడికి పాల్పడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్ పేర్కొన్నారు. ఈ ఘటనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆకర్షించుకుని స్కూల్ సమీపంలోని ఒక భవనానికి తీసుకెళ్లి అసభ్య వ్యవహారాలకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ సంఘటన సమాజాన్ని తలదించేలా చేసిందన్నారు. ఘటన అమానుషమన్నారు. నిందితుడు ఎవరైనా సరే, కఠినతికఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ బలంతో కేసును అణచివేస్తే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఘటిస్తామని హెచ్చరించారు. తక్షణమే కేసులను విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు . ఇటువంటి దుర్మార్గమైన సంఘటనల పై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ తరపున బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

