బెస్త కార్పోరేషన్ చైర్మన్ పదివికి కూటమి ప్రభుత్వంలో బెస్త నాయకులే లేరా..?
బెస్త కుల జె. ఏ. సి నాయకులు యాట్ల నాగేశ్వరరావు
రాష్ట్రములో దాదాపు 15 లక్షలు జనాభా కలిగిన బెస్త లు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కి మద్దతుగా పనిచేసి, మెజారిటీ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బెస్త ల పాత్ర కీలకమైనద ని అయినప్పటికీ వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ప్రభుత్వ తీరుపై ఉభయ గోదావరి జిల్లాల బెస్త కుల జె. ఏ. సి నాయకులు యాట్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ల నియామకంలో భాగంగా బెస్తలు కాని వారికి బెస్త కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం బెస్త లైన మమ్మల్ని అవమానించడేమనని, బెస్త కులం కాని వ్యక్తికి పదవిని కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పుడు బెస్త కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని ఇచ్చిన వ్యక్తి బెస్త నే కాదని ఆరోపిస్తూ, అతన్ని వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో మా బెస్త లకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోతే కోస్తాలో ఇవ్వాలని, అంతే గానీ బెస్త కులం కాని వారికి ఇవ్వడం అనేది రాష్ట్రం లో ఉన్న బెస్త కుల జాతిని అవమానించడమేనని, బెస్త కార్పోరేషన్ చైర్మన్ పదివికి కూటమి ప్రభుత్వంలో బెస్త నాయకులే లేరా.? అని యాట్ల ప్రశ్నించారు.