బూత్ లెవెల్ అధికారుల జాతీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా కపిలేశ్వరపురం శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలక్టర్ పి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బూత్ లెవెల్ అధికారి న్యూఢిల్లీ వెళ్ళి శిక్షణ పొంది వచ్చిన ఏడిద వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ నాగం నాగ శివ శిక్షణ ఇచ్చి ప్రతిజ్ఞ చేయించారు.ధ్రువపత్రాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం తహసిల్దార్ జి.శ్రీనివాస్ మండపేట సహాయ ఓటరు నమోదు అధికారి ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ఎ. మెహర్ బాబా ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది,166 నుండి 210 వరకూ ఉన్న పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.

