Monday, August 4, 2025
Monday, August 4, 2025

బూత్ లెవెల్ అధికారుల శిక్షణా తరగతులు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పరిశీలించిన వైసిపి నేత యారమాటి…

 

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

మండపేట అసెంబ్లీ నియోజకవర్గం (48) ఓటర్ నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్ పి.కృష్ణమూర్తి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం 15-7-2025 న ఆయన ఆదేశాలు మేరకు మండపేట పురపాలక సంఘం కార్యాలయంలో పట్టణ పరిధిలో ఉన్న 64 నుండి 109 వరకు గల పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులకు సహాయ ఓటరు నమోదు అధికారి ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ.మెహర్ బాబా ఆధ్వర్యంలో ఎన్నికల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీ వెళ్ళి శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ ఏడిద సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ నాగం నాగ శివ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు హాజరై శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. వెంకన్నబాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా బూత్ లెవెల్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఈ శిక్షణా తరగతులు వల్ల పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది కావున ఏకాగ్రతతో అవగాహన చేసుకుని ప్రజల వద్దకు వెళ్ళి కొత్త ఓట్లు నమోదు, చేర్పులు, మార్పులు గురించి అవగాహన కల్పించే విధంగా సిద్ధం కావాలని తెలిపారు. ఎన్నికల విధులు, బాధ్యతలు, ఫారం-6, 6 ఏ, 7, 8, 9, 10, 11, 11ఏ, 11బి, 12, 13  14 లపై శిక్షణ  ఇచ్చారు. ఎన్నికల కమీషన్  నుండి వచ్చిన గూగుల్ లింక్  ద్వారా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ, ధ్రువపత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్యాలయపు సిబ్బంది, 64 నుండి 109 వరకూ ఉన్న పోలింగ్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo