బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఆర్.ఆర్.సి, ఓటరు నమోదు అధికారి పి.కృష్ణమూర్తి ఆద్వర్యంలో మండల కేంద్రమైన రాయవరంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గల మీటింగ్ హాల్ నందు, నెంబర్ 48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి సోమవారం 113 నుండి 157 వరకూ ఉన్న పోలింగ్ స్టేషన్ లకు చెందిన బూత్ లెవెల్ అధికారులకు, న్యూఢిల్లీ వెళ్ళి శిక్షణ పొంది వచ్చిన, మండపేట మండలం ఏడిద సచివాలయ వెల్ఫేర్,ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మాస్టర్ ట్రైనర్ నాగం నాగ శివ ద్వారా బూత్ లెవెల్ అధికారులకి సంబంధించిన ఎన్నికల విధులు,బాధ్యతలు, ఫారం-6, 6ఎ, 7, 8, 9, 10, 11, 11ఎ, 11బి,12,13,14 ల పై శిక్షణ ఇచ్చిన అనంతరం సాయంత్రం గం.4.00 నుండి 5.00 గం.ల వరకూ, ఎన్నికల కమీషన్ వారి నుండి వచ్చిన గూగుల్ లింక్ ద్వారా పరీక్ష నిర్వహించి, తదుపరి ప్రతిజ్ఞ చేయించి,వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు అధికారి రాయవరం తహశీల్దార్ ఐ.పి.శెట్టి, సహాయ ఓటరు నమోదు అధికారి, మండపేట ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ.మెహర్ బాబా, రాయవరం డిప్యూటీ తహశీల్దార్ కె. భాస్కర్, రీ సర్వే డి.టి. ఐ.సంధ్య, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది,113 నుండి 157 వరకూ ఉన్న పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.

