సుపరిపాలన తొలి అడుగులో ఎమ్మెల్యే వేగుళ్ళ…
చంద్రన్న పాలనలో ప్రతి ఇల్లు సంక్షేమ పథకాలతో కలకలాడుతున్నాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం మండపేట పట్టణంలోని 26,27,28 వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, కూటమి శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సంధర్బంగా సూపర్ సిక్స్ పధకాలు అమలు తీరును ప్రజలకు వివరించారు. ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్, వివిధ రకాల వర్గాలకు అందుతున్న పెన్షన్ విధానంపై ప్రజలతో మాట్లాడి వారి నుంచి చంద్రన్న పాలనపై వివరాలు అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆయా వార్డులలోని ప్రజలతో మమేకమై వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న ఉత్సాహాన్ని, సంతోషాన్ని చూసి ప్రజలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో వాటి వివరాలు కూడా ఎమ్మెల్యే సేకరించారు.కార్యక్రమంలో ఆయా వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.