విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రతి ఒక్కరూ విద్యలో ఉన్నతులు కావాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు కోరారు.అయినవిల్లి మండలం నేదునూరు పెదపేటకు చెందిన నామాడి శ్రీనివాస్ కుమారుడు దినేష్ నీట్ లో మంచి ర్యాంకు వచ్చి ఎంబిబిఎస్ సీటు సాధించాడు.ఈ సందర్భంగా గురువారం అమలాపురం గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఎంబిబిఎస్ సీటు సాధించిన దినేష్ ను రమణారావు సత్కరించారు.దినేష్ కు రమణారావు దుశ్శాలువా కప్పి అభినందించి ప్రోత్సహకంగా రూ. 50 వేలు చెక్కును రమణారావు దినేష్ కు అందించి మరింత ఉన్న శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు సరెళ్ళ రామకృష్ణ,పరమట రాజశేఖర్,గంటా లక్ష్మీ ప్రసాద్,షేక్ బాబ్జి,ఎన్.శ్రీనివాస్, గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.