గుర్రంకొండ
సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై జూన్ 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లె హంద్రీ-నీవా కాలువ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సోమవారం సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొన్న పోలీసులు మృతుడు శ్రీనివాసులరెడ్డిగా గుర్తించి కేసు విచారణ చేపట్టారు