జక్కంపూడి రాజా దీక్ష భగ్నం దారుణం..
- ఇసుక దోపిడీ ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు
- కూటమి పాలనపై విరుచుకుపడ్డ వైసిపి బిసి నాయకుడు బూడిద శరత్ కుమార్
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని ఆంధ్ర రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సీనియర్ నాయకుడు బూడిద శరత్ కుమార్ విమర్శించారు.ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోందని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అందుకే మద్యం స్కామ్ పేరుతొ మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసారని విమర్శించారు.ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికుతోందని, ఇక...
బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరణ - మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్;
పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చేవరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం ఆరుసార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు...
రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో..
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్;
రాజమండ్రి జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం దేవాంగ కుల దేవత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మ వారి జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి పూజ,సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు,ఈ సందర్భంగా అమ్మ వారికి పువ్వులు,పండ్లు,పలురకాల మిఠాయిలతో ఆషాఢ సారె,చీరలు...
స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం..
విశ్వం వాయిస్ న్యూస్, రాజమండ్రి
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినా,మాట్లాడినా అదొక మరపురాని జ్ఞాపకంగా అందరికీ మిగిలిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన సీఎం లలో డాక్టర్ వైఎస్ ని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డా వైఎస్ అని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. డా వైఎస్ చిత్రపటానికి భక్త్యంజలి ఘటించారు.
ఈసందర్బంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ తో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలామందికి డాక్టర్ వైఎస్ తో మరిచిపోలేని అనుబంధం ఉందన్నారు. అంతటి బలమైన ముద్ర అందరి మనస్సులో డాక్టర్ వైఎస్ వేసుకున్నారన్నారు....