28 October 2025
Tuesday, October 28, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

అంబేద్కర్ కోనసీమ

త్రాగునీటి సమస్య ఏర్పడకుండా జనరేటర్ ఏర్పాటు

నదురుబాద గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు ముందుచూపు ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు తుఫాను ప్రభావం దృష్ట్యా బయటకు రావద్దని హెచ్చరిక విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం మొథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందనే ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో, గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య ఎదురవకూడదనే ఆలోచనతో నదురుబాద గ్రామంలో జనరేటర్ ను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం తో మంగళవారం ఉదయం నుండి విద్యుత్ లేనందున త్రాగునీటి ఇబ్బంది ఏర్పడ కూడదని ముందు జాగ్రత్త చర్యలుగా జనరేటర్ ను ఏర్పాటు చేసామని, ఈ జనరేటర్ ద్వారా విద్యుత్ కలెక్షన్ ఇచ్చి త్రాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు....

యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతున్న విద్యుత్ శాఖ

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొథా తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తూ,తీవ్ర ప్రభావం చూపనుందనే ఉన్నతాధికారుల హెచ్చరికల మేరకు, రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు ఆదేశాలతో రాయవరం మండల వ్యాప్తంగా 33 కె.వి లైన్ తీగలపై విరిగిపడే అవకాశం ఉన్న చెట్టు కొమ్మలు,తాటి, కొబ్బరి చెట్లను మంగళవారం ఉదయం నుండి అసిస్టెంట్ ఇంజనీర్ సందాక శ్రీనివాసులు ఆధ్వర్యంలో లైన్ మేన్ శ్రీకాంత్ ఇతర సిబ్బందితో కలిసి యుద్థ ప్రాతిపదికన తొలగించారు. ఈ సందర్భంగా ఎ.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ తుఫాను తీవ్రత అధికంగా ఉన్నందున ముఖ్యంగా సబ్ స్టేషన్ లకు విద్యుత్ సరఫరా జరిగే లైన్లను ముందుగా పరి రక్షించే...

పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో అఖిల

రాయవరం హైస్కూల్ లో 219 మందికి ఆశ్రయం సోమేశ్వరం, మాచవరం కేంద్రాలకు 95 మంది తరలింపు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం మొంథా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందనే వాతావరణం శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రాణం నష్టం సంభవించకూడదనే ఆలోచనతో ఇచ్చిన ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, పూరిపాకలు,బలహీన గృహాల లో నివాసం ఉంటున్న వారిని, ఇటుక బట్టీ లలో పనిచేసే అంతర్రాష్ట్ర కూలీలను స్థానిక నాయకులతో కలిసి అధికారులు సోమవారం పునరావాస కేంద్రాలకు తరలించారు. సోమేశ్వరం గ్రామంలో పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారిని రామచంద్రపురం ఆర్డిఓ డి.అఖిల సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రం వద్ద విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు...

వైయస్సార్ పార్టీని వీడిన అంజూరి శ్రీనివాస్ చౌదరి…

పార్టీ కార్యక్రమాలలో పూల వర్షాలతో జోష్ నింపిన వ్యక్తిగా గుర్తింపు... విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అత్యంత సన్నిహితుడిగా, రేవు శ్రీను కు ముఖ్య అనుచరుడిగా వైయస్సార్ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు అంజూరి శ్రీనివాస్ చౌదరి.అయన తన వ్యక్తిగత కారణాలు దృష్ట్యా నేటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు స్థానిక విలేకరులకు సోమవారం తెలిపారు.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 వార్డు గెలుపు కోసం కీలకపాత్ర పోషించాడు.ప్రతి గడపగడపకు తిరిగి తోట త్రిమూర్తులు విజయ కోసం రాత్రి పగలు తారతమ్యం లేకుండా అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా...

మండల వ్యాప్తంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు

సచివాలయ అధికారుల పర్యవేక్షణలో 35 పునరావాస కేంద్రాలు రెవెన్యూ, సివిల్ సప్లయ్, పంచాయతీ రాజ్ శాఖల సంయుక్త నిర్వహణ తీవ్ర తుఫాను దృష్ట్యా పలు జాగ్రత్తలు తప్పనిసరి రాయవరం మండల తహశీల్దార్ భాస్కర్ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల వ్యాప్తంగా మంథా తుఫాను ప్రభావం దృష్ట్యా, తీవ్ర తుఫాన్ గా మారిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాయవరం మండల తహసిల్దార్ భాస్కరరావు తెలిపారు. తీవ్ర తుఫాను ప్రభావం వలన బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు సూచనలు హెచ్చరికలను ఆయన చేశారు. పాడుబడిన పెంకుటిల్లు, పూరిపాకల లో నివాసం ఉండేవారు తప్పనిసరిగా ప్రభుత్వం...

సన్మాల ధనరాజు కు వైసీపీ నాయకుల పరామర్శ…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట పట్టణ కమిటి ఉపాధ్యక్షులు సన్మాల ధనరాజు ను మారేడుబాక గ్రామం సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, మండపేట సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పెంకే గంగాధర్, నియోజకవర్గం వైసీపీ ఐటి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు లు పరామర్శించారు. స్థానిక 11వ వార్డులో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి…

కోటి సంతకాల ఉద్యమంలో చైర్ పర్సన్ రాణి... విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు.ఆదివారం మండపేట పట్టణం 20వ వార్డు వైస్సార్ కాలనిలో ఆమె ఇంటి ఇంటికి తిరుగుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.ప్రైవేటీకరణ జరిగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రవేటికరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారే అవకాశం ఉందని, పేదలకు నడ్డి విరిచే...

వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి

పాఠశాల, హాస్టల్ లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలి విద్యార్థులకు త్రాగునీరు, టాయిలెట్ అవసరాలపై అవగాహన కల్పించాలి తప్పనిసరిగా లేబర్ మూమెంట్ రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలి హెల్త్ అసిస్టెంట్ లకు మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ సూచనలు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం హెల్త్ అసిస్టెంట్స్ అందరూ తమ పరిధిలో గల హాస్టల్స్ ను సందర్శించి ఆ పరిస్ధితులను విజిటర్ బుక్స్ లో నమోదు చేయాలని మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ సూచించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట యూనిట్ పరిధిలో గల గొల్లపుంత అర్బన్ హెల్త్ సెంటర్ నందు సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ ఆధ్వర్యంలో శనివారం...

రెడ్డి జానకి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన పలువురు …

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ మాజీ గౌరవ అధ్యక్షులు రెడ్డి జానకి రామయ్య(87) ఇటీవల మృతి చెందారు. ఈయన మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ కు పెద్ద నాన్న అవుతారు. పాటి మీద ఆయన స్వగృహానికి వెళ్ళి పలువురు పరామర్శించారు.ఆయన మనుమలు చోడే రాంబాబు, పెనుమర్తి సూర్య, వారి కుటుంబ సభ్యులను బిక్కిన పెద్ద చిన్న, బిక్కిన వీరబాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్,టెకీముడి శ్రీనివాస్ , నాయకులు తాడి రామారావు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల రాంబాబు, రామోజు కృష్ణ,పంపన శ్రీను, పిఠాపురం సత్యనారాయణ పరామర్శించారు

కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కంటి తుడుపుగానే ఉంది…

బాధితులకు ఎక్స్‌గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలి...   ఎమ్మెల్సీ తోట డిమాండ్... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ విస్ఫోటనం ఘటనలో పదిమంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి, తక్షణమే చెల్లించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo