చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిట్టూరి యామిని,లింగం వెంకట కృష్ణ
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
మండల కేంద్రమైన రాయవరంలో ఇటీవల బాణాసంచా కర్మాగారంలో జరిగిన విస్ఫోటనం లో మృతుల సంఖ్య పదికి చేరింది. సంఘటన లో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి సావరం కి చెందిన చిట్టూరి యామిని, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (చినబాబు) లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాద తీవ్రత తో ఘటనా స్థలంలోనే నిర్వహకునితో కలిపి ఆరుగురు సజీవదహనం కాగా, గాయపడిన నలుగురు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందడం ఆవేదన కలిగించే విషయం.
కొద్దిపాటి నిల్వలైనా ప్రమాదకరంగా మారవచ్చు
బాణాసంచా అక్రమ నిల్వలు గుర్తిస్తే 112 లేదా 100 కు సమాచారం అందించాలి.
రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయన మీడియా ద్వారా, దీపావళి పండుగ సందర్భంగా, ప్రజల భద్రత దృష్ట్యా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఇళ్ళ వద్ద బాణాసంచా తయారీ లు చేపట్టినా, ఇంట్లో బాణాసంచా నిల్వ చేసినా సమాచారం ఇవ్వాలని , అమ్మకాలు, తయారీకి సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా...
ఘటన జరిగిన 48 గంటలలోపే కేసును చేధించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందనలు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
ప్రయాణికులతో వస్తున్న ఆటోను అడ్డగించి ఆటోడ్రైవర్ , ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో నిందితులైన శాఖా వినయ్ వంశీ, మాచవరపు వెంకట సాయి గణేష్, రిమ్మలపూడి శ్రీ సాయి కృష్ణ, పర్వతిని మౌళి సాయి క్రిష్ణ లను మంగళ వారం అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించినట్లు మండపేట రూరల్ సీఐ దొర రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ 06 సోమవారం ఉదయం 3.30 గంటలకు వెదురుపాక సావరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వాసంశెట్టి రామకృష్ణ, తన బందువులైన అనసూరి శ్రీనివాస్...
కొత్తపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కీలక సమావేశం
వ్యాపారుల సహకారం అనివార్యం
ట్రాఫిక్ నియంత్రణకు వ్యాపారులు సహకరించాలి
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట వార్తలు
కొత్తపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కీలక సమావేశం
వ్యాపారుల సహకారం అనివార్యం
ట్రాఫిక్ నియంత్రణకు వ్యాపారులు సహకరించాలి
డీఎస్పీ సుంకర మురళీమోహన్
విశ్వం వాయిస్ న్యూస్
కొత్తపేట, సెప్టెంబర్ 15:
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మరియు పండుగల సీజన్‌కు సంబంధించిన నిబంధనలపై పోలీసులు కీలక సూచనలు చేశారు.
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
అన్ని వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని పోలీసులు...
45 మంది పేకాటరాయుళ్లకు జరిమానా
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట మరియు గండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 45 మందిని పోలీసులు అదుపులో కి తీసుకుని పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రతి ఒక్కరిపై రూ.300 చొప్పున జరిమానా విధించి, మొత్తం రూ.13,500/- వసూలు చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
గుర్తు తెలియనిమహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రావులపాలెం
మహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం
స్థానిక రావులపాలెం ఎస్సై ఇచ్చిన వివరాల మేరకు ఉదయం 13- 09- 2025 ఉదయం 6:30 గంటల సమయంలో కొమర్రాజు లంక వంతెన వద్ద రావులపాలెం నుండి. అమలాపురం రోడ్డు లో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా అటుగా వెళుతున్న వారు 108 కి కాల్ చెయ్యగా అంబులెన్స్ లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు ఇచ్చిన ఆసుపత్రి ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రావులపాలెం ఎస్ ఐ చంటి తెలిపారు. మృతురాలు రోడ్డు దాటుచున్న. సమయంలో ఏదైనా వాహనము డికొట్టి ఉండవచ్చునని...
ఐ పోలవరం మండలం
చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారైన మోసగాడ
అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మి డివరం నియోజకవర్గంలో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారయ్యాడు ఓ మాయగాడు..
వివరాల్లోకి వెళితే ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి చింతలపూడి వీర శంకర రావు(బుజ్జి) గత కొన్నే ళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ, స్దానికుల వద్ద నమ్మకం పెంచుకున్నాడు. అయితే ఇటీవల పాడుకున్న చిట్టీల తాలూకూ సొమ్ములు ఇవ్వకుండా సాకులు చెబుతూ హఠాత్తుగా గ్రామం నుండి అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు .ఈ ఘటనపై స్దానిక ఎమ్.ఎల్.ఎల్ దాట్ల సుబ్బరాజును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు ఎమ్. ఎల్.ఎ సూచనతో బాధితులు
పోలీసులకు పిర్యాదు చేసారు..
బాధితుల ఫిర్యాదుతో కేసు...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అల్వాల్
అల్వాల్‌లోని ఓ జిమ్‌లో పరిచయమైన యువతిని కబంధం చేసుకోవడానికి ప్రయత్నించిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి అలియాస్ రఫీ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిత్య పెళ్లికొడుకు పేరుతో ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న రవి, ఈసారి కొత్తగా పరిచయమైన యువతిని వేదింపులకు గురిచేశాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, జిమ్‌లో పరిచయం అయిన ఆ యువతి కారులో రవి గుప్తంగా ట్రాకింగ్ డివైస్ అమర్చాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ సంభాషణల్ని రికార్డు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి డబ్బు కోసం బెదిరించడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని, అంతేకాక స్థానిక నేతపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని కూడా బలవంతం పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఆ యువతి ధైర్యం...
రూరల్ సీఐ పీ దొరరాజు...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా గణనాధుల నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో జరగాలని మండపేట రూరల్ సీఐ పీ దొరరాజు సూచించారు. మండలంలోని ఏడిదలో శుక్రవారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనాల సమయంలో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు, డీజేలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో పిల్లలను తీసుకెళ్లరాదని, విద్యుత్ వైర్లకు దూరంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో, నిర్ణీత సమయానికే నిమజ్జనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.
8 మందిపై కేసు నమోదు...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండలం
మండపేట మండలం లోని ఏడిదలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న కొందరు వ్యక్తులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ కు అందిన సమాచారం మేరకు ఎస్సై వీ కిషోర్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. గ్రామ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై కిషోర్ తెలిపారు. వారి వద్ద నుండి రూ.7,800 నగదు, 104 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.