విశ్వం వాయిస్ న్యూస్, వాషింగ్టన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అధ్యక్షుడికి అంత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం లేదని కొట్టిపారేసింది. ఈ తీర్పు అమెరికా రాజకీయాలలో సంచలనం రేపింది.
ఈ వివాదాస్పద టారిఫ్‌లు ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కొన్ని దేశాలపై విధించబడ్డాయి. ముఖ్యంగా భారత్‌పై 25 శాతం ప్రతిస్పందన సుంకం విధించటం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు కోర్టు ఈ చర్యను చట్టవిరుద్ధంగా తేల్చింది.
ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "ఇది పూర్తిగా రాజకీయపరమైన, పక్షపాతంతో కూడిన తీర్పు. ఇది...
విశ్వం వాయిస్ టెక్ డెస్క్,
అమెరికా మోంటానా రాష్ట్రంలో ఒక చిన్న విమానం గల్లంతైన ఘటనలో స్మార్ట్‌వాచ్ కీలకంగా మారింది. విమానం గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే రాడార్ నుంచి అదృశ్యమైంది. పైలట్‌తో పాటు మిగతా ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
శోధన కొనసాగుతున్న సమయంలో స్మార్ట్‌వాచ్ సిగ్నల్
విమాన శకలాల కోసం వెతికిన రెస్క్యూ బృందాలకు ఊహించని దారిని చూపించింది ఒక ప్రయాణికుడి స్మార్ట్‌వాచ్. ఆ డివైస్ నుంచి వచ్చిన లొకేషన్ సిగ్నల్ ఆధారంగా, యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ప్రమాద స్థలాన్ని గుర్తించారు. ఈ శకలాలే మిస్సింగ్ విమానానికి చెందినవని అధికారులు ధృవీకరించారు.
పైపర్ PA-28 విమానం
ఈ సింగిల్ ఇంజిన్ విమానం వ్యక్తిగత ప్రయాణం కోసం ఉపయోగించబడింది. గురువారం అర్ధరాత్రి తర్వాత విమానం...