విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అల్వాల్
అల్వాల్‌లోని ఓ జిమ్‌లో పరిచయమైన యువతిని కబంధం చేసుకోవడానికి ప్రయత్నించిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి అలియాస్ రఫీ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిత్య పెళ్లికొడుకు పేరుతో ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న రవి, ఈసారి కొత్తగా పరిచయమైన యువతిని వేదింపులకు గురిచేశాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, జిమ్‌లో పరిచయం అయిన ఆ యువతి కారులో రవి గుప్తంగా ట్రాకింగ్ డివైస్ అమర్చాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ సంభాషణల్ని రికార్డు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి డబ్బు కోసం బెదిరించడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని, అంతేకాక స్థానిక నేతపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని కూడా బలవంతం పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఆ యువతి ధైర్యం...
రామచంద్రపురం గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి
గొల్లపాలెంలో విద్యార్థుల భారీ ప్రదర్శన
సంఘీభావం తెలిపిన నాయకులు
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, కాజులూరు
రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) ఆధ్వర్యంలో కాజులూరు మండలం గొల్లపాలెంలో కాజులూరు జంక్షన్ నుండి మార్కెట్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రామచంద్రపురం, కే గంగవరం మండలాలను కాకినాడ జిల్లాలో విలీనం చేయాలంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ జెఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల కరెస్పాండంట్ చెల్లుబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, స్థానిక సర్పంచ్ పోతురాజు ప్రసన్నమౌనిక, బాబురావు, సొసైటీ...
విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
విశ్వం వాయిస్ న్యూస్, కాజులూరు
విద్యుత్ భారాలు, ట్రూ అప్ చార్జీలు,పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుందని, వీటికి వ్యతిరేకం గా ప్రజలు ఉద్యమం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్సులు ఎం రాజశేఖర్, వళ్ళు రాజబాబు పిలుపునిచ్చారు. కాజులూరు మండలం, శీల్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలతో కలిసి విద్యుత్ బారాలకు వ్యతిరేకం గా ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టట్టారు. స్మార్ట్ మీటర్లు రద్దు, సెకి ఒప్పందం రద్దు చేయాలని, ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేయబోయే మరో చార్జీలు భారాలు కు వ్యతిరేకంగా ఆగష్టు 28 ప్రతిజ్ఞ దినం పాటింంచినట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ వద్దు అంటే...
ఘనంగా యేసురాజు జన్మదిన వేడుకలు
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, కాకినాడ
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు గుబ్బల యేసురాజు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలుచోట్ల కేకులు కట్ చేసి ఆయన వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలు యేసురాజుకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన్ని పూలదండలు, దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకుముడి సత్యనారాయణ, టీడీపీ నాయకులు దంగేటి గౌరీశంకర్, వెంకటరమణ, బోమిడి సోమాలమ్మ, వి ధరణి, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీసెల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా సోమాలమ్మ
మంత్రి సుభాష్ కి కృతజ్ఞతలు
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, కాకినాడ
రాష్ట్ర ఎస్సీసెల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కాజులూరు మండలం గొల్లపాలెం ధనలక్ష్మి పేటకు చెందిన బోమిడి సోమాలమ్మ ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన సోమాలమ్మని రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేయడం పట్ల కాజులూరు మండల దళిత సంఘ నాయకులు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా సోమాలమ్మ మాట్లాడుతూ టీడీపీ కోసం పడ్డ కష్టాన్ని గుర్తించి తనకు మంచి గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు....
విశ్వం వాయిస్ న్యూస్, కుకట్పల్లి
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కుకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల సహస్రపై దారుణ హత్య జరిపిన నిందితుడు పెద్దవాడు కాదని, 14 ఏళ్ల పదో తరగతి చదువుతున్న బాలుడేనని పోలీసులు వెల్లడించారు.
సహస్ర ఆగస్టు 21న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికిన తర్వాత రెండవ రోజు ఆమె మృతదేహం కుకట్పల్లిలోని ఓ ఇల్లు వద్ద లభ్యమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక విచారణ ఆధారంగా చివరికి పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సహస్రతో స్నేహం ఉన్నట్లు, ఒక చిన్న విషయంపై...
₹20 కోట్ల మోసం — షేర్ మార్కెట్ నిపుణుడిని నమ్మి 170 మంది పెట్టుబడులు
అధిక వడ్డీ ఆశ చూపి విశ్రాంత ఉద్యోగులు, వృద్ధుల వద్ద నుంచి లక్షల్లో వసూలు
వడ్డీ చెల్లింపులు ఆపి పరారి అయిన దినేశ్ పాణ్యం.. కార్యాలయానికి తాళం
బాధితుల ఆవేదన: ప్రభుత్వంతో పాటు పోలీసుల నిర్లక్ష్యంపై వాపోలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, హైదరాబాద్
మల్కాజిగిరిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 170 మందిని మోసం చేసి రూ.20 కోట్లు తీసుకొని ఓ వ్యక్తి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ మోసం వెనక ఉన్న నిందితుడు దినేశ్ పాణ్యం, తనను షేర్ మార్కెట్ నిపుణుడిగా పరిచయం చేసుకొని విశ్రాంతులు, వృద్ధులు, ఐటీ ఉద్యోగుల...
రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ !
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల అనుమతుల్ని ప్రభుత్వం తేలిక చేస్తోంది. ఇప్పటికే ఐదు అంతస్తుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్ని కూడా సులభతరం చేస్తోంది. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి , “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతులను 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. నెలల తరబడి జాప్యం అయ్యే అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయంలో...
తెలంగాణకు బుల్లెట్ ట్రైన్
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, హైదరాబాద్
తెలంగాణకు బుల్లెట్ రైలు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి ప్రతిపాదనలు సమర్పించారు.ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఉండేలా ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతున్నాయి.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన !
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెలను నియమించారు.
అపోలో హాస్పిటల్స్‌లో CSR వైస్ ఛైర్‌పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆరోగ్యం,...