లబోదిబో మంటున్న భాదితులు
తిరుగుడుమెట్టలో కలకలం
తాళ్లపూడి మండలం టి.మెట్ట గ్రామం లో చిట్టీల వేస్తూ కిరణ వ్యాపారం చేస్తున్న బెల్లంకొండ సత్యనారాయణ అనే వ్యక్తి భార్య తో సహా పరారయ్యారు. దీనితో టి.మెట్టలో చిన్న పెద్ద కుటుంబాల జనం లబో దిబొ మంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ లు గ్రామానికి రావటం, తమ డబ్బులు దాచుకున్న వారు గగ్గోలుంపెడుతూ రోడ్డెక్కటం మొత్తం మీద గ్రామం అంతా గంధర గోళం గా మారింది. వడ్డీ వస్తుందని కొంత మంది ఒకరికి తెలియకుండా ఒకరు బెల్లంకొండ సత్యనారాయణకు అప్పులిచ్చామని, చిట్టి పాడుకున్నా డబ్బునివ్వలేదని పలువురు మహిళలు సైతం వాపోతున్నారు. పఱరైన బెల్లంకొండ తో భార్య కూడా వెళ్లిపోయిందని, బాకిల వాళ్ళు వేధిస్తున్నారని భయం తో వూరు వదిలి వెళ్లిపోతున్నట్లు, ఒక ఉత్తరం వ్రాసి వెళ్లిపోయారని సమాచారం. ఇంటి తాళం వేసి ఉందని ఇంట్లోకి వెళితే మరికొన్ని విషయాలు తేలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఊరువదిలి పోయిన బెల్లం కొండ కు ఇద్దరు కుమారులుండగా ఒకరు లండన్, మరొకరు హైద్రాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారని సమాచారం.