అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం చిందాడ గరువు రామాలయం సెంటర్ లో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారిదగ్గర తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న స్వామివారి ఐదు కేజీల లడ్డు ప్రసాదం ను కాజా నాగేశ్వరరావు కుమారుడు రమేష్ వేలంపాటలో 61000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా వరసిద్ధివినాయక కమిటీ వారు రమేష్ ను శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం ను అందజేశారు. వేలం పాట లో స్వామి వారి లడ్డు తమకు దక్కడం అదృష్టం గా భవిస్తున్నామని కాజా నాగేశ్వరరావు మరియు వారికుమారుడు రమేష్ సంతోషం వ్యక్తం చేసారు.ఈ లడ్డు వేలంపాట కార్యక్రమం లో బొంతు తాతరావు, శీలం సాయిరాం, మొల్లేటి హేమంత్ ,గుబ్బల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు..