WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

పవన్ కళ్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్(renu desai)కి పవన్ కళ్యాణ్(pawan kalyan)మాజీ భార్యగా పవన్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోను మంచి గుర్తింపు ఉంది.కొన్నాళ్ల క్రితం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా కూడా ఆ తర్వాత వెనకడుగు వేసింది.గత కొంత కాలం నుంచి పలు రకాల  సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఎన్నో సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో షూటింగ్ లో పాల్గొనడం కోసం ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది.అయితే సినిమా వివరాలు, హీరో ఎవరనే విషయం మాత్రం వెల్లడి చెయ్యలేదు.దీంతో పవన్  ఫ్యాన్స్  ఆ సినిమా వివరాలు కూడా చెప్పచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే ఆ సినిమా పవన్ దేనా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఏడాది తర్వాత రేణు షూటింగ్ లో పాల్గొనబోతుండంతో ఆమె అభిమానులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు  

 మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన రేణు దేశాయ్  2000 వ సంవత్సరంలో  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి తో హీరోయిన్ గా సినీ అరంగ్రేటం చేసింది.ఆ తర్వాత తమిళంలో జేమ్స్ పండు అనే మూవీతో పాటు పవన్ తోనే జానీ అనే మరో మూవీలో చేసింది.ఇక ఆ తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి పవన్ నటించిన చాలా సినిమాలకి స్టయిలిస్ట్ గా వర్క్ చేసింది.గత సంవత్సరం రవితేజ(ravi teja) హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు లో ఒక కీలకమైన పాత్రలో చేసి మెప్పించింది.

 




Source link

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement