WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రోలెక్స్ నిజంగానే పెద్ద గ్యాంగ్ స్టార్..నా గత సినిమాతో సంబంధం ఉంది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


సూర్య(suriya)అప్ కమింగ్ మూవీ కంగువా(kanuguva)నవంబర్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. శివ(siva)దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్ గా చేస్తుండగా దిశాపటాని హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో కంగువా పై సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్ర నిర్మాత  జ్ఞానవేల్ రాజా(jnanavel raja)కంగువా రెండు వేల కోట్ల రూపాయిల వసూళ్ళ ని సాధిస్తుందని కూడా చెప్పాడు.  

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఈ క్రమంలోనే రీసెంట్ గా ముంబై వేదికగా ఈవెంట్ జరిగింది.ఇందులో పాల్గొన్న సూర్య కంగువా తర్వాత తన నుంచి రాబోయే సినిమాల విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 2022 లో లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన మూవీ విక్రమ్.అన్ని లాంగ్వేజెస్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రోలెక్స్ అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో సూర్య కనపడ్డాడు.క్లైమాక్స్ సీన్ లో కొన్ని నిమిషాల పాటే కనపడినా కూడా  రోలెక్స్ పాత్రలో సూర్య  ప్రదర్శించిన గాంబీర్యం విక్రమ్ విజయ శాతాన్ని కూడా పెంచింది.లోకేష్ కూడా రోలెక్స్ టైటిల్ తో సూర్యతో మూవీ ఉంటుందని ప్రకటించాడు.

ఇప్పుడు ఈ రోలెక్స్ గురించే కంగువా ఈవెంట్ లో సూర్య మాట్లాడుతు 1986లో విడుదలైన విక్రమ్ మూవీకి ఇప్పటి విక్రమ్ మూవీకి ఎలాంటి సంబంధం ఉందో, రోలెక్స్ సినిమాకి కూడా నా గత సినిమాలతో సంబంధం ఉందని చెప్పాడు. దీంతో ఏ మూవీ అయ్యుంటుందని సూర్య అభిమానులు తెగ ఎగ్జైట్ కి లోనవుతున్నారు.

 




Source link

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement