టీడీపీ – జనసే – బీజేపీ కలిసి పోటీ చెయ్యడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని అందరూ ముఖ్త ఖంఠంతో ఒప్పుకుంటారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి బాలయ్య, లోకేష్ లను తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలులో మీటయ్యి అక్కడే పొత్తుగా పోటీ చేసేందుకు బీజం వేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఏపీకి మాత్రమే కాదు దేశ ప్రజలందరికి తెలుసు. అయితే జైలులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఏం మాట్లాడుకున్నారు, పవన్ చంద్రబాబు ను పొత్తు కు ఎలా ఒప్పించారనే విషయంలో చాలా సస్పెన్స్ కనిపించింది.
తాజాగా NBK అన్ స్టాపబుల్ షోలో ఆ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు చంద్రబాబు. రీసెంట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన బాలయ్య – చంద్రబాబు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 1 ఆది నంచి ఆహ్లాదంగా, సరదాగా, కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ గా సాగిపోయింది. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు అరెస్ట్ విషయమై ఆయన మాట్లాడినప్పుడు ప్రతి టీడీపీ అభిమాని కంటతడి పెట్టారనడంలో సందేహం లేదు.
నేను, జగన్ తండ్రి గారైన వైస్సార్ రాజకీయాల్లో చాలాసార్లు పోటీపడ్డాం. ఏనాడు మా మధ్య ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. ఏదైనా ఉన్నా సిద్దాంతపరమైన విభేదాలకే మా మధ్యన రాజకీయం పరిమితమైంది. జగన్ వ్యక్తిగత అహంకారంతో ఇలా అడ్డదారిలో అరెస్ట్ చేయడం దారుణం. అంతేకాదు, చట్ట నిబంధనల ప్రకారం అరెస్ట్ చెయ్యకుండా రోజంతా విచారణ పేరుతో వేధించారు.
నా కోసం పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపై నిరసన తెలియజేయడం అందరికి తెలిసిందే. రాజమండ్రి జైలులో నన్ను కలువడానికి పవన్ కల్యాణ్, మీరు, లోకేష్ వచ్చారు. అక్కడ పవన్ నేను కాసేపు మాట్లాడుకొన్నాం. అప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ధైర్యంగా ఉన్నారా సార్ అని అడిగాడు. మీరు ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మనమంతా కలువాల్సిన అవసరం వచ్చిందని అన్నారు.
అక్కడే ఆ ఆలోచనతో అప్పుడే విజయానికి తొలి మెట్టు పడింది. ఎలాంటి షరతులు లేకుండా పొత్తుకు పొద్దు పొడిచింది.. అంటూ చంద్రబాబు పవన్ తో జైలులో ఏం మట్లాడారో అనే విషయాన్ని ఈ షో వేదికగా రివీల్ చేసారు.