ఏ స్టార్ హీరో అయినా ఫ్యాన్స్, ప్రజల ముందుకు వస్తున్నారంటే జనం ఎగబడడం అనేది కామన్. అదే స్టార్ హీరో పార్టీ పెడుతున్నాడు అంటే అదే జనం ఆయనకు హారతులు పేరుతో.. నీరాజనాలు పడతారు. కానీ ఓట్లేసే సమయానికి హ్యాండ్ ఇస్తారు. అలా ఆంధ్రలో మెగాస్టార్ చిరు ప్రజారాజ్యం ఎనౌన్స్ చేసినపుడు లక్షలాది ప్రజలు మెగాస్టర్ సభకు తరలివచ్చారు.
ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరు ప్రజారాజ్యం తరపున దుమ్మురేపి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తారనుకుంటే కేవలం 18 సీట్లకి పరిమితం చేసారు అభిమానులు, ప్రజలు. ఇక ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అనగానే ఆయన అభిమానులు, ప్రజలు కోకోల్లలుగా ఆయనకు మద్దతునిచ్చారు. హీరోగా చూసారు కానీ రాజకీయనేతగా చూడలేదు. ఓట్లే వెయ్యలేదు, ఆయన్ని దారుణంగా ఓడించారు. రెండుసార్లు ఓడిపోయారు.
మూడోసారి తన పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పి టీడీపీ, బీజెపి తో చేతులు కలిపి చివరికి విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ను అడుగడుగునా మొసం చేసారు. ఇప్పడు ఇలాంటి పరిస్థితే విజయ్ కి వస్తుందా.. లేదంటే ఎన్టీఆర్, ఎంజీఆర్ లా ప్రభంజనం సృష్టిస్తూ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.
నిన్న ఆదివారం చెన్నై లో విజయ్ నిర్వహించిన సభకు వచ్చిన జనం చూస్తే అయ్యో విజయ్ నువ్వు ఈ జనాలని, నీ అభిమానులని చూసి విజయకేతనం ఎగురవేయడం పక్కా అని కలలు కనకు.. నీ వ్యూహాల్లో నువ్వు ఉండు. అంతేకాని జనాలను, ఫ్యాన్స్ ను నమ్మకోకు అంటూ విజయ్ కి నెటిజెన్స్ సలహాలిస్తున్నారు.
మరోపక్క విజయ్ నేను ఏ పార్టీ కి తొకగా ఉండును, రాబోయే తమిళనాడు ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, నా ఫ్యాన్స్ ను జెండా కూలికి పంపను, ఒకే పార్టీ ఒకే జెండా అంటూ విజయ్ ఆవేశం చూసాక విజయ్ ఏదో సాధించేలానే కనిపిస్తున్నాడు.