తమిళ అగ్ర హీరో ఇళయ తలపతి విజయ్(vijay)స్థాపించిన పొలిటికల్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ మొదటి మీటింగ్ ఇటీవల విల్లుపురంలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులోనే విజయ్ తమ పార్టీ జెండా కూడా ఆవిష్కరించాడు.సుమారు ఆరు లక్షల మంది దాకా హాజరయ్యారనే వార్తల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల్లో వణుకు కూడా పుడుతుంది.
ఈ మీటింగ్ లో విజయ్ తమ పార్టీ విధి విధానాలుని సూటిగా చెప్పాడు.అదే టైంలో సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేసే వాళ్ళకి తమిళ, తెలుగు సినిమాలో అగ్ర హీరోలుగా చెలామణి అయ్యి ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన ఎంజీఆర్(mgr)ఎన్టీఆర్(ntr)లని మరోసారి గుర్తు చేసాడు.తమతో పాటు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు కుంటామని కూడా వెల్లడి చేసి తమిళనాట సరికొత్త రాజకీయాలకి తెర లేపుతానని కూడా చెప్పినట్టయ్యింది.దీంతో ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ని విజయ్ కలుస్తాడనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగం నుండి వెళ్లే రాజకీయాల్లో విజయాన్ని సాధించాడు.ఆ ప్రాసెస్ లో ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కోవడంతో పాటుగా పొత్తుల పరంగా ముందుకు వెళ్ళాడు.దీంతో పవన్ కళ్యాణ్ ని కలిసి రాజకీయ పరమైన సలహాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చాలా కాలం నుంచి పవన్, విజయ్ ల మధ్య మంచి పరిచయం ఉంది. విజయ్ నటించిన కొన్ని సినిమాలని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ని అందుకున్నాడు. విజయ్ పొలిటికల్ పార్టీ సక్సెస్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేసాడు.