WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

కేటీఆర్ పాదయాత్ర.. హరీష్ సంగతేంటి..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

  • టాగ్స్
  • ktr

కేటీఆర్ పాదయాత్ర.. పెద్ద ప్లానే ఉందిగా!

పాదయాత్ర.. చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేయొచ్చు అన్నది నాటి నుంచి నేటి వరకూ నడుస్తూనే ఉన్నది. ఎందుకంటే నాడు వైఎస్సార్, నారా చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు చాలా మందే పాదయాత్ర చేశారు. ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. అందుకే అదే పంథాలో నడవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేతలు. ఇప్పుడు తెలంగాణలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా క్యాడర్‌లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇంత సడన్‌గా, అదేనండోయ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఈ టైమ్‌లో ఎందుకు పాదయాత్ర? ఈ యాత్ర వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? ఈ యాత్రతో ఏం సందేశం ఇవ్వాలని చిన్న బాస్ అనుకుంటున్నారని సర్వత్రా చర్చ నడుస్తోంది.

ఏమైందో.. ఏమో?

తెలంగాణను పదేళ్ల పాటు ఏలిన బీఆర్ఎస్, 2023 ఎన్నికల్లో ప్రజలు పక్కనెట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండానే చేసేశారు రాష్ట్ర ప్రజలు. ఎందుకిలా జరిగింది? ఎక్కడ లోపం ఉంది? అని ఇప్పటికీ తెలుసుకోలేకలేని పరిస్థితి. సిట్టింగులను మార్చడం, మోనార్క్ తనం, హామీలు సరిగ్గా లేకపోవడం అని బయట టాక్ నడుస్తున్నప్పటికీ కారు పార్టీకి మాత్రం ఇంకా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఇప్పటికే కేసీఆర్ మూలాలు లేకుండా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే ఏడాదిలో పేరు వినిపించకుండా చేస్తానని శపథాలు చేస్తున్నారు. దీంతో గులాబీ బాస్ మౌనం పాటిస్తూ ఉండటం, కేడర్‌లో నిస్తేజం వచ్చేసింది. ఎంతలా అంటే కేసీఆర్ కనీసం ఫామ్‌ హౌస్ నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అటు కేటీఆర్, ఇటు హరీష్ రావులు మాత్రమే హడావుడి చేస్తున్నారు.

పెద్ద ప్లాన్ ఉన్నట్టుందే!

బీఆర్ఎస్ పార్టీకి నాటికి, నేటికి ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కేసీఆర్ తర్వాత నంబర్ హరీష్ రావు అని చెబుతుంటారు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు చూడటం కానీ, అసంతృప్తులను నచ్చజెప్పడం, మంతనాలు చేయడం, ఏదైనా పని అప్పగిస్తే దిగ్విజయంగా ముగించుకుని రావడంలో హరీష్ ముందుంటారు. అందుకే ఆయన్ను కట్టప్ప అని, నంబర్ టూ అని కూడా పిలుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు తాను ఏంటో నిరూపించుకోవాలని కేటీఆర్ గట్టిగా ఉన్నారట. అందుకే నంబర్ టూ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కేటీఆర్ అప్పుడప్పుడు ధర్నాలు, ర్యాలీలు, మీడియా ముందుకొచ్చి హడావుడి చేస్తుంటారనే ఆరోపణలు లేకపోలేదు. ఎందుకంటే హరీష్‌కు మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ దూకుడును తట్టుకోవడం ఎవరితరం కాదు, ఎవరూ అలా ఉండలేరు. ట్రై చేద్దామన్నా అయ్యే పనికాదు. ఇక ఇవన్నీ సాధ్యం కాదని ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్న చిన్న బాస్ పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో నంబర్-2 స్థానంతో పాటు క్యాడర్‌ను కాస్త దారిలోకి తెచ్చుకోవచ్చని భావిస్తున్నారట.

కానివ్వు.. కేటీఆర్!

ఇవన్నీ ఒక ఎత్తయితే నా తర్వాత నువ్వే, ఇక షురూ చేసేయ్ అని కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయట. అంతేకాదు.. కాబోయే ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ అని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2027లోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పదే పదే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు బల్లగుద్ధి మరీ చెబుతున్నారు. దీంతో ఇప్పట్నుంచే షురూ చేస్తే ఏడాదిలోపు లేదా ఏడాదిన్నరలోపు పాదయాత్ర పూర్తి చేయొచ్చని కేటీఆర్ ప్లాన్ ఏమో. దీనికి తోడు ప్రభుత్వంపై వ్యతిరేకత సైతం ఉంది. రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన, హైడ్రా, మూసీ సుందరీకరణ, చేరికలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్‌గానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తే ప్రజలను తమవైపు తిప్పుకోవడంతో పాటు, పార్టీలో నంబర్ టూ.. నెక్స్ట్ సీఎం తానేనని చెప్పుకునేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హరీష్ రావు ఏం చేయబోతున్నారు? ఇదంతా కేసీఆర్ ఆదేశాల మేరకు జరుగుతోందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌తో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులే చోటుచేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.. వేచి చూడాలి మరి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement