లెజండరీ సినీ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి(chakravarthy)గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ,శోభన్ బాబు, కృష్ణంరాజు,చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సూపర్ స్టార్స్ సినిమాలకి ఎన్నో హిట్ పాటలని అందించారు.హీరోలకి లాగానే చక్రవర్తి గారికి కూడా వీరాభిమానులు ఉన్నారంటే అయన సృష్టించిన సంగీత ప్రాభవాన్నిఅర్ధం చేసుకోవచ్చు. తన సుదీర్ఘ సంగీత ప్రపంచంలో సుమారు తొమ్మిది వందల కి పైగా సినిమాల్లో ఐదు వేల కి పైగా పాటలని ప్రేక్షకులకి అందించారు.
నలభై సంవత్సరాల క్రితం చక్రవర్తి గారికి మ్యూజిక్ స్టూడియో నిర్మాణం నిమిత్తం స్వర్గీయ నందమూరి తారక రామారావు(ntr)ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 14లో ఇరవై గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆయన సంబంధిత పట్టా తీసుకున్నారే కానీ ఆ తర్వాత స్థలం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2002 లో అయన మరణించాక కూడా కుటుంబ సభ్యులు సైతం స్థలాన్ని పట్టించుకోలేదు.దీంతో కొంత మంది కబ్జా దారులు స్తలాన్ని ఆక్రమించి గుడిసెలు వేసుకోవడం జరిగింది.దీంతో ఈ విషయం రెవిన్యూ అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్థలం విలువ దాదాపు డెబ్భై ఐదు కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.ఇప్పుడు ఈ విషయం సినీ సర్కిల్స్ తో పాటు సామాన్య ప్రజల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. చక్రవర్తి గారి కుటుంబ సభ్యుల వివరాలకి వస్తే ఆయన కుమారుడు’ శ్రీ’ కూడా సంగీత దర్శకుడు గా చాలా సినిమాలకి పని చేసారు. 2015 లో అనారోగ్య కారణాలతో మరణించగా, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం మూవీలోని పాటలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి.