సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో తెరకెక్కబోతున్న మూవీకి సంబంధించిన పనులన్నీ చకచకా జరుగుతున్నాయి.ఒక పక్క ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు లొకేషన్స్ సెర్చ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ బిగింగ్ లో మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.దుర్గ ఆర్ట్స్ పతాకంపై ఎన్నో హిట్ చిత్రాలని అందించిన కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తుండగా,విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నాడు.
ఇప్పడు ఈ మూవీ గురించి ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(tammareddy bharadwaj)మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యాక్టర్స్ మహేష్, రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు.దీంతో సినిమా బడ్జట్ వెయ్యి కోట్లు దాటవచ్చు.బిజినెస్ కూడా అంతకు మించి రెండు వేల కోట్ల రూపాయిలు దాటవచ్చని రాజమౌళి టీం భావిస్తుంది.ఈ నంబర్ మూడు, నాలుగువేల కోట్లు వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అదే జరిగితే భారతీయ సినీ రంగంలోనే ఆ ఇద్దరి మూవీ ఒక చరిత్ర అవుతుంది. భవిష్యత్తుని ముందుగానే ఉహించడంలో రాజమౌళి మంచి నేర్పరి.
బాహుబలి వచ్చిన తర్వాత వంద కోట్లు,ఆర్ ఆర్ ఆర్ తో 300 కోట్లు అంటే చాలా చిన్న సినిమా లెక్క అయిపోయింది.రేపు మహేష్ మూవీ వచ్చాక 500 కోట్ల బడ్జట్ చిన్న విషయంలా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.ప్రెజంట్ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.మహేష్ అభిమానులు అయితే ఆ కామెంట్స్ ని నెట్టింట షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.