అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో చేసినవే. ముఖ్యంగా పుష్ప చిత్రానికి మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు బన్ని చేసిన అన్ని సినిమాలకూ భిన్నమైన క్యారెక్టర్ పుష్పరాజ్. డైలాగ్ డెలివరీలోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ మునుపెన్నడూ చూపించని వైవిధ్యాన్ని చూపించారు. దానికి తగ్గట్టుగానే బన్నీ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఇరగదీశారు. అందుకే వందేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరూ సాధించని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును బన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత సీక్వెల్‌పై సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ‘పుష్ప2’కి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. అంటే ప్రేక్షకులు అంత ఈగర్‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది.
డిసెంబర్ 5న పుష్పరాజ్ మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. రిలీజ్‌కి ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప చిత్రంలోని చివరి అరగంట మాత్రమే కనిపించిన భన్వర్‌సిగ్ షెకావత్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగానే ఆ పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ ఓ రేంజ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పుష్ప, భన్వర్‌సింగ్ మధ్య వచ్చే ప్రతి సీన్ అద్భుతంగా వచ్చింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరూ తమ తమ క్యారెక్టర్స్‌లో లీనమై నటించారు. సీక్వెల్‌పై ఆడియన్స్‌కి అంతగా క్రేజ్ పెరగడానికి భన్వర్‌సింగ్ క్యారెక్టరే కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో సీక్వెల్‌లో పుష్ప, భన్వర్‌సింగ్ మధ్య వచ్చే సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారి ఆసక్తికి తగ్గట్టుగానే ఆ సీన్స్‌ను ఎంతో పవర్‌ఫుల్ చిత్రీకరించారని తెలుస్తోంది.
పుష్ప2లో తన క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బన్నితో చేసిన యాక్షన్స్ సీన్స్‌ను సుకుమార్ ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. పుష్ప2పై వున్న ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్‌తోనే కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని బన్ని ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా చెబుతున్నారు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్‌పై సుకుమార్ ఎక్కువ శ్రద్ధ పెట్టారట. పుష్ప2కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పుష్పరాజ్‌ను మరోసారి స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలవుతున్న పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.