ByGanesh
Thu 14th Nov 2024 11:13 PM
అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన విశ్వరూపాన్ని బయటపెట్టారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారని మండిపడ్డారు. గురువారం శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటరిచ్చారు. వైసీపీ సోషల్ మీడియా అరెస్టులపై చర్చకు వైసీపీ శాసనమండలిలో పట్టుబట్టింది. అయితే ఇందుకు శాసన మండలి చైర్మన్ అనుమతించలేదు. దీంతో వారంతా చైర్మన్ పోడియంను చుట్టిముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి చైర్మన్ ఎంత చెప్పినప్పటికీ ఎమ్మెల్సీలు వినకపోవడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లిని మానసిక క్షోభకు గురి చేసేలా నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. గత వైసీపీ పాలనలో చంద్రబాబు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారు. నా తల్లిని అవమానించిన తర్వాతే బాయ్ కాట్ చేశారు. అయినా మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉన్నారు.. అదీ మా చిత్తశుద్ధి అని నారా లోకేశ్ వెల్లడించారు.
న్నారు.
ఏం.. మాట్లాడొద్దా?
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అయినా సరే చంద్రబాబు హౌస్‌కు వచ్చారు. సింగిల్‌గా సింహంలా నిలబడ్డారు. మళ్లీ చెబుతున్నా గుర్తుపెట్టుకోండి, పోరాడారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. గౌరవ సభ అయిన తర్వాత వస్తా అన్నారు. ఈ రోజు కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు ఇవన్నీ గుర్తులేవా? జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు. మా సభ్యులు కూడా ఏనాడూ మాట్లాడలేదు. జగన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎందుకు రాలేదు? మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? మేం మాట్లాడొద్దా? మేం మనుషులం కాదా? తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని లోకేష్ మండలిలో కన్నెర్రజేశారు.
టికెట్లు ఎలా ఇచ్చారు?
ఎవరిని.. ఎవరు అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించడం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పగా.. ఇందుకు స్పందిస్తూ లోకేష్ కౌంటర్ ఎటాక్ చేశారు. సమర్థించడం లేదని మీరు చెబుతున్నారు సరే.. టికెట్లు ఎలా ఇచ్చారు? అంటే సమర్థించినట్లు కాదా? ఇవన్నీ బొత్స ఆలోచించుకోవాలని క్లాస్ పీకారు. మాట్లాడాలి అనుకుంటే ఎన్నెన్నో మాట్లాడగలం కానీ ఎవరూ మాట్లాడరని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. ఇవాళ అటు అసెంబ్లీలో రఘురామ ఎపిసోడ్.. ఇటు మండలిలో లోకేష్ ఎపిసోడ్‌తో వాడివేడీగానే జరిగింది. దీనిపై నెక్స్ట్ మీడియా మీట్‌లో వైఎస్ జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Minister Lokesh Firing Speech:
Nara Lokesh Mass Speech in Assembly