నందమూరి నట సింహం బాలకృష్ణ(balakrishna)హోస్ట్ గా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాఫబుల్ షో ఎంతగా పాపులర్ అయ్యిందో అందరకి తెలిసిందే.ప్రెజంట్ సీజన్ 4 లో ఉన్న ఈ షో మొదటి ఎపిసోడ్ ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)తో ప్రారంభించి ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ ని కూడా కలగ చేసింది.
త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)కి సంబంధిచిన ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోలు గత కొన్ని రోజులుగా విడుదల అవుతున్నాయి.ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక ప్రోమో విడుదల అయ్యింది.అందులో స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ పిక్ రాగానే పవన్ కళ్యాణ్ మీద నీ ఒపీనియన్ ఏంటని అల్లు అర్జున్ ని బాలయ్య అడగటం జరిగింది
అప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్(pawan kalyan)గారి దైర్యం అంటే నాకు చాలా ఇష్టం.సొసైటీ లో నేను చాలా మంది లీడర్స్, బిజినెస్ మేన్స్ ని దగ్గర నుంచి చూస్తుంటాను. కానీ నేను లైవ్ లో మాత్రం పవన్ గారి ధైర్యాన్ని చూస్తుంటాను. చాలా డేరింగ్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.