WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

Nayanthara is furious with Dhanush ధనుష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నయన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార ఫైర్ అవుతూ రాసిన ఓపెన్ లెటర్ ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ధనుష్ వ్యక్తిత్వం ఇలాంటిది, మీరు అభిమానులకు నీతులు చెప్పడం కాదు మీరు ముందు పాటించండి, తండ్రి, సోదరుడు అండ తో హీరో అయ్యారు, స్వశక్తితో పైకి వచ్చే వాళ్లకు విలువనివ్వండి అంటూ నయనతార ధనుష్ పై సంధించిన లేఖ ఇప్పుడు నెట్టింట సంచలంగా మారింది. 

అసలు నయనతార ధనుష్ పై అంతగా తీవ్ర విమర్శలు చెయ్యడానికి కారణం.. ధనుష్ నయనతార వాళ్లకు ఓ NOC ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే. నయనతార హీరోయిన్ గా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా తెరకెక్కన నానున్ రౌడీనే మూవీ లో సీన్స్, పాటలు ఉపయోగించుకునేందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, మూడు సెకన్ల మ్యూజిక్ వాడుకున్నందుకు ధనుష్ వాళ్ళు 10 కోట్లు పరిహారం కోరడం పై నయనతార భగ్గుమంది. 

నయనతార జీవితంలోపై ప్రముఖ ఓటీటీ సంస్థ తెరకెక్కించిన డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ లో నయనతార వ్యక్తిగత జీవితం, విగ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి, ఆమె నటించిన సినిమాలు అన్ని భాగం కాబోతున్నాయి. అందుకు సంబంధించి ఆమె లైఫ్  లో ఎంతో ఇంపార్టెంట్ అయిన నానుమ్ రౌడీనే చిత్రంలోని కొన్ని సీన్స్, సాంగ్స్ వాడుకోవడానికి ధనుష్ పర్మిషన్ ఇవ్వకుండా NOC రాకుండా కోర్టులో కేసు వెయ్యడం పట్ల నయనతార తీవ్రంగా స్పందించింది. 

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒంటరి మహిళగా సవాళ్లతో వచ్చి కష్టపడి, చిత్తశుద్ధితో ఈ స్థాయికి చేరుకున్నాను. నన్ను ప్రేమించే నా అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రయాణం గురించి బాగా తెలుసు. నాపై చాలా సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని తప్పుడు చర్యలను నేను ఇప్పుడు ధైర్యంగా బయటపెట్టాలనుకుంటున్నాను. 

మీరు తండ్రి , గ్రేట్ డైరెక్టర్ బ్రదర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినీ పరిశ్రమకు వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మీరు మీ ఈ చిల్లర పనులను అర్థం చేసుకుని సరిదిద్దుకోండి. నాలాగే, నా అభిమానులు, శ్రేయోభిలాషులు చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కోసం ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్ని పనులు పూర్తి చేసి ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యాము. కానీ ఇప్పుడు మీ రివెంజ్ ప్రవర్తన నా భర్తను మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ పనికి పనిచేసిన ప్రతి ఒక్కరిపై పడింది. ప్రేమ, పెళ్లితో సహా నా జీవితంలోని ఆనంద ఘట్టాలు ఉన్న ఈ డాక్యుమెంటరీలో తీపి జ్ఞాపకాలను తీసుకెళ్లడానికి పలు సినిమాల్లోని సీన్లను ఉపయోగించేందుకు చాలా మంది వెంటనే అంగీకరించారు. కానీ నానుమ్ రౌడీతాన్ సినిమా రాలేదని బాధగా ఉంది. నే

ను నా జీవితంలో పొందిన ప్రేమకు ఆ సినిమా సీన్స్ ఉపయోగించలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ లో నానుమ్ రౌడితాన్ నుండి ఫుటేజ్, పాటలు, ఫోటోలను ఉపయోగించడానికి మీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేటర్ రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2 ఏళ్లు వేచి చూసినా ఫలితం లేకుండా పోయి ఇప్పుడు విడుదలవుతున్న డాక్యుమెంటరీని రీ షూట్ చేసి, ఎడిట్ చేసి రూపొందించాం. 

నానుమ్ రౌడీతాన్ పాటలు నేటికీ అభిమానులు ఇష్టపడటానికి కారణం.. అందులో అద్భుతమైన సాహిత్యం. ఆ పాటలలోని కొన్ని లైన్లను మేము డాక్యుమెంటరీలో ఉపయోగించకపోవటం ఎంత కలత కలిగిస్తుందో మీకు తప్ప అందరికీ అర్థమవుతుంది. ఇది కేవలం బిజినెస్ పరమైన.. లేదా చట్టబద్ధమైనదైతే నేను NOC నిరాకరణను ఖచ్చితంగా అంగీకరించి ఉండేవాడిని. కానీ ఇది పూర్తిగా నా పట్ల ఉన్న మీ వ్యకిగత ద్వేషంతో చేసిన పనిని ఎలా ఒప్పుకోగలరు.. 

ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై లీగల్ నోటీసు పంపడం చూసి షాకయ్యాను. అంతేకాదు.. ప్రైవేట్‌గా తీసిన సీన్‌కి, ఇప్పటికే వెబ్‌సైట్లలో షేర్ చేసినందుకు పది కోట్లు పరిహారం కోరడం చాలా విచిత్రం. ఈ వినయపూర్వకమైన చర్య మీరు ఎలాంటి వ్యక్తి అనేది తెలియజేస్తుంది. మీరు స్టేజ్ పై మాట్లాడే మాటలను మీరు ఒక్కసారి కూడా పాటించరని నాకు, నా భర్తకు తెలుసు. ఒక నిర్మాత తన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాన్ని, స్వేచ్ఛను నియంత్రించగలడా.. చట్టపరమైన చర్యలను చట్టపరంగా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నానుమ్ రౌడీతాన్ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు పాటలకు కాపీరైట్ నో హోల్డ్ బ్యార్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను దయచేసి కోర్టుకు వివరించండి. అంటూ నయనతార ధనుష్ పై ఫైర్ అవుతూ రాసిన లేఖ వైరల్ అయ్యింది. 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement