ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై గత ఎలక్షన్స్ సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపి లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు(maddipadu)పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)పై కేసు నమోదయిన విషయం తెలిసిందే.దీంతో మద్దిపాడు పోలీసులు వర్మ ని కలిసి విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. విచారణ పై మధ్యంతర ఉత్తుర్వులు జారీ చెయ్యాలంటూ వర్మ ఏపి హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు.కానీ ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమంటూ కోర్టు తన తీర్పుని ప్రకటించింది.
కానీ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ ద్వారా నాకు ఇంకో నాలుగు రోజుల సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి అందరిలో ఉండగా వర్మ కూడా అజ్ఞాతంలో కి వెళ్ళుంటాడా అనే చర్చ సినీ అండ్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది.