WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

కడప దర్గాకి రామ్ చరణ్ ఎందుకు వెళ్ళాడు..గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు  

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)సంక్రాంతి కానుకగా, వచ్చే ఏడాది జనవరి పది న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తుంది.ఈ క్రమంలోనే  రిలీజైన టీజర్ గేమ్ చేంజర్ పై అంచనాలని పెంచేసింది.అదే టైంలో ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు మూవీని కూడా స్టార్ట్ చేసిన చరణ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈ మూవీకి భారతీయ సినిమా గర్వించదగ్గ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటం  ప్రాధాన్యతని సందర్శించుకుంది.

కొన్ని రోజుల క్రితం చరణ్ తో కడప దర్గాలో జరిగే 80వ నేష‌న‌ల్ ముషాయిరా గ‌జ‌ల్ ఈవెంట్‌కి రావాలని  రెహమాన్ చెప్పడం జరిగింది.దీంతో చరణ్ సోమవారం కడప దర్గాని దర్శించుకున్నాడు.అనంతరం మీడియా తో మాట్లాడుతూ కడప దర్గాని దర్శించుకోవడం నా అదృష్టం. ఈ దర్గాకి ఎప్పటికి రుణపడి ఉంటాను. పన్నెండు సంవత్సరాల క్రితం నా కెరీర్ ని మలుపు తిప్పిన మగధీర సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందు ఇక్కడి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాను.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.నాకు మంచి స్టార్ డమ్ ని కూడా  తీసుకొచ్చింది.నాన్న గారు కూడా ఎన్నో సార్లు ఈ దర్గా ని సందర్శించారు. ఏ ఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మాలలో ఉన్న కూడా ఆయనకి ఇచ్చిన మాట తప్పకూడదని ఇక్కడకి వచ్చానని తెలిపాడు.

ఇక చరణ్ వస్తున్న విషయం తెలుసుకున్న మెగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకున్నారు.ఒక పెద్ద క్రేన్ తో భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఇకఅయ్యప్ప స్వామి మాలలో రామ్ చరణ్ సందర్శించడంపై కొంత మంది అయ్యప్ప స్వాములతో పాటు పలు హిందూ సంఘాలు మండి పడుతున్నాయి.దర్గా అంటే ఒక సమాధి. దాన్ని సందర్శిస్తే మాలను తీసివేయాలి కదా అని అంటున్నారు.మరి కొంతమంది మాత్రం శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా వావర్ స్వామి అనే ముస్లిమ్ భక్తుడి సమాధిని దర్శించుకునే అయ్యప్ప దగ్గరకి వెళ్తారనే విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.

    


advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement