WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మంత్రికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మంత్రికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!

అవును.. ఇద్దరి మధ్య విభేదాలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో తెలియట్లేదు కానీ నిండు అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. పోనీ ఒకరోజు అనుకుంటే ఏమో అనుకోవచ్చు.. పదే పదే ప్రశ్నలతో ఇబ్బంది పడుతుండటంతో ఓరి బాబోయ్.. ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరాలు ఏమైనా ఉన్నాయా..? లేకుంటే ఆయనకు మంత్రి పదవి వచ్చి తనకు రాలేదని కానీ.. రెండోసారి కూడా మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? అని నిట్టురుస్తున్నారో అర్థం కానీ పరిస్థితి.

దొందూ దొందే!

ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. సీనియారిటీ పరంగా, రాజకీయంగా ఇద్దరూ ఆరితేరిన వారే. కానీ ఎక్కడ చెడిందో తెలియట్లేదు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమయం, సందర్భం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అదికాస్త అసెంబ్లీ వరకూ వచ్చింది. ఒకరోజు జీరో అవర్ అనేది డ్రైవర్ లేని కారులా ఉందని విమర్శలు గుప్పించడం, మంత్రులు అందరూ సభ్యులు ప్రశ్నలను వింటున్నారా..? లేదా అని ఘాటుగానే మాట్లాడారు. దీంతో అచ్చన్న స్పందించి, వివరణ ఇచ్చుకున్నారు. ఎవరో సంగతి కాదు తాను మాత్రం ప్రతి విషయాన్ని నోట్ చేసుకొని, పరిష్కార మార్గం చూపిస్తాననీ చెప్పడంతో ఈ ఇద్దరికీ ఏమైందీ? అంటూ సభ్యులు గుసగుసలాడిన పరిస్థితి. ఆయన ప్రశ్నలు వేయడం, ఈయన కూడా ఏ మాత్రం తగ్గకుండా రివర్స్ ఎటాక్ చేయడంతో సరిపోయింది. 

మళ్ళీ.. మళ్ళీ..!

మొదటిసారి సంగతి అటుంచితే రెండోసారి ఏకంగా మంత్రినే టార్గెట్ చేసినట్టుగా ప్రశ్నించారు. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని కూన మాట్లాడారు. పక్క రాష్ట్రంలో లక్ష ముప్పై వేలకు మాత్రమే కొంటే, ఇక్కడ మాత్రం రెండు లక్షల నాలుగు వేల వరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. అంతేకాదు పేరుగాంచిన గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కనెట్టి కోల్డ్ చైన్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అని కూడా ప్రశ్నించిన పరిస్థితి. దీంతో అచ్చెన్న స్పందించి హారిజాంటల్, వెర్టికల్ అని రెండు రకాలుగా ఉంటాయని కేంద్రం చెప్పినట్టుగానే కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇంతకు కొన్నారు? అని వివరంగా చెప్పాల్సిన పరిస్థితి. ఇలా రెండ్రోజులు ఒకే జిల్లాకు చెందిన సీనియర్లు ఇలా ప్రశ్నలు, సమాధానాల గడపడంతో ఏం జరుగుతోంది..? మంత్రిని కూన టార్గెట్ చేశారా..? అని అందరూ చర్చించుకుంటున్నారు.

ఓహో ఇదే కారణమా?

అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకపోయేసరికి కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మారిపోయిన పరిస్థితి. ఇందులో వసంతకృష్ణ ప్రసాద్, జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్ ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా మంత్రి పదవి ఆశించి భంగపడిన వారే. ఎందుకంటే వైసీపీ నుంచి గెలిచి 2014 ఎన్నికల తర్వాత టీడీపీలోకి వచ్చిన జ్యోతుల ఈసారి మంత్రి పదవి ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ ఈయన్ను టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఇక వసంత పరిస్థితీ ఇంతే. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చి గెలిచి నిలిచారు. మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఆశించారు కానీ దక్కలేదు. ఈయనకు రావాల్సిన పదవి అటు కొల్లు రవీంద్ర, ఇటు కొలుసు పార్థ సారథి ఎగరేసుకుని పోయారు. దీంతో ఈ ఇద్దరిపై గుర్రున ఉన్న ఎమ్మెల్యే.. అసెంబ్లీ కొల్లు చిన్న మాట అనేసరికి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక కూన రవికుమార్ పరిస్థితి ఈ ఇద్దరినీ మించి. స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేనిని ఓడిస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నట్లు ఉన్నారు. ఐతే జిల్లా నుంచి అచ్చన్నకు రావడంతో ఆ ఫ్రస్టేషన్‌తోనే ఇలా మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఇంకా ఎంత మంది ఇలా ఏదో ఒక రూపంలో బరస్ట్ అవుతారో..!

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement