మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పు చేసినవాళ్లను వెనకేసుకురావడం విడ్డురంగా ఉంది. పిన్నెల్లి ఈవీఎం లు ధ్వంసం చేస్తే తప్పు కాదట, నందిగం సురేష్ హత్య కేసులో జైలు కెళితే అదీ తప్పు కాదట, వీళ్ళను వెళ్లి జైలులో పరామర్శించి వస్తారు. ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో జోగి రమేష్ వాళ్ళది తప్పు కాదు, తన ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై హద్దులు దాటి మాట్లాడిన వాళ్లకు మంత్రి పదవులిచ్చిన జగన్ అంతకన్నా ఇంకేం చేస్తాడులే అంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు.
తాజాగా జగన్ అసెంబ్లీ కి వెళ్లకుండా మీడియా మీట్ లతో కాలక్షేపం చేస్తూ సోషల్ మీడియాలో చెడుగా పోస్ట్ లు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నా మీద చంద్రబాబు వివేకం సినిమా తీస్తే తప్పు లేదు అది గొప్ప.
అదే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై వ్యూహం తీసి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ తో సినిమా విడుదల చేస్తే తప్పంట అంటూ RGV ని జగన్ వెనకేసుకురావడం అందరికి షాకిచ్చింది. RGV గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై ఎలాంటి నీచమైన పోస్ట్ లు పెట్టాడో అందరికి తెలుసు. అది తప్పు కాదట.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీస్తే తప్పులేదు, అతనిపై కేసులు పెడతారా అంటూ జగన్ తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తూ మట్లాడడం అందరికి షాకిచ్చింది.