ByGanesh
Fri 22nd Nov 2024 02:17 PM
నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల వివాహానికి ముహూర్తం దగ్గరపడుతోంది. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతు-శోభితల వివాహం జరిపించడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి ని తన కొడుకు సింపుల్ గా జరిపించాలని తనని కోరినట్లుగా నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో నాగ్ చైతు వివాహంపై మాట్లాడారు.
ఈ ఏడాది తమకి చాలా ప్రత్యేకమని, అన్నపూర్ణ స్టూడియో తన తండ్రికి ఇష్టమైన ప్రదేశం, మాకు ఈ స్టూడియో వారసత్వంగా వస్తుంది, అక్కడ నాగ చైతన్య-శోభితల వివాహం జరగడం సంతోషాన్నిస్తుంది. తన పెళ్లిని సింపుల్ గా చెయ్యమని చైతు కోరాడు. కుటంబ సభ్యులు,స్నేహతులు, సినీ ప్రముఖులు ఇలా ఓ మూడు వందలమందిని ఈ పెళ్లికి ఆహ్వాస్తున్నాము,
అన్నపూర్ణ స్టూడియో లో అందమైన సెట్ లో నాగ చైతన్య-శోభితల వివాహం జరగబోతుంది, పెళ్లిపనులు వాళ్లిద్దరే దగ్గరుండి చూసుకుంటామని చెప్పారు, శోభిత చాలామంది అమ్మాయి, వైజాగ్ నుంచి వచ్చి ఏంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది, ఆ అమ్మాయి మా కోడలిగా రావడం సంతోషంగా ఉంది అంటూ నాగార్జున శోభిత-నాగ చైతన్య పెళ్లిపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
Nagarjuna comments on Chai-Sobhita marriage:
Nagarjuna shares a big update about Naga Chaitanya-Sobhita Dhulipala wedding