Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

చెల్లూరు హై స్కూల్ లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మాదకద్రవ్యాల మత్తు నిండు జీవితాన్ని నాశనం చేస్తుంది

విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి దూరంగా ఉండాలి

రాయవరం ఎస్సై డి సురేష్ బాబు

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం

మాదక ద్రవ్యాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలని, ఇవి యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తూ, చదువులో వెనుకబడే లా చేస్తాయ‌ని రాయవరం ఎస్సై సురేష్ బాబు విద్యార్థులకు తెలిపారు. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో గల శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం నిర్వహించి, మాదకద్రవ్యాల పట్ల విద్యార్థులకు రాయవరం ఎస్సై సురేష్ బాబు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అనేకులు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి దూరంగా ఉండాలని హెచ్చరించారు, వీటికి అలవాటు పడిన విద్యార్థులు,యువకులు చదువులను వదిలిపెట్టి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారన్నారు, ఒకసారి ఈ మత్తుకు బానిసలైతే ఎంతటి అకృత్యాలు,నేరాలు చేయడానికైనా వెనుకాడరని పలు ఉదాహరణలను విద్యార్థులకు వివరించారు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాల‌ని తగు సూచనలు తెలిపి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని విద్యార్థులకు సూచించారు,అనంతరం సమాజానికి చేటు చేసే మత్తు పదార్థాల జోలికి వెళ్లబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు, ముఖ్యంగా తమ,తమ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినా,అమ్ముతున్నట్లు తెలిసినా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు,ఇతర పోలీస్ సిబ్బంది, పాఠశాల అద్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo