ముమ్మిడివరం నగర పంచాయతీలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా చూసేందుకు విద్యుత్ శాఖ వారు ఎక్కడికక్కడ విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. తొలగించిన చెట్ల కొమ్మలను రోడ్డు ప్రక్కన వేసారు. మరుసటి రోడ్డు మున్సిపాలిటీ వారు తొలగిస్తారనే అందరూ అనుకున్నారు. తొలగించిన చెట్ల కొమ్మలను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది మాకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.మున్సిపల్ కార్యాలయం చెంతనే మొక్క కొమ్మలు ఉన్నా మున్సిపల్ కమీషనర్ గాని, పారిశుధ్య సిబ్బంది కాని పట్టించుకోలేదు. వ్యాపార బడ్డీ షాపులకు వద్ద మొక్క కొమ్మలు పడి ఉన్నా పట్టించుకోని అధికారులు.